हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Sold His Daughter : రూ.5వేలకు కూతురిని అమ్మేసిన తండ్రి.. పట్టించిన CC కెమెరాలు

Sudheer
Sold His Daughter : రూ.5వేలకు కూతురిని అమ్మేసిన తండ్రి.. పట్టించిన CC కెమెరాలు

విజయవాడలో ఒక కసాయి తండ్రి తన మూడేళ్ల కూతురిని కేవలం రూ.5 వేలకు అమ్మేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన మస్తాన్ అనే వ్యక్తి, గురువారం రాత్రి విజయవాడ బస్టాండ్ వద్ద పరిచయమైన ఒక మహిళ, ఒక పురుషుడికి తన కుమార్తెను విక్రయించాడు. అనంతరం, కూతురు కనిపించడం లేదని, ఎవరో కిడ్నాప్ చేశారంటూ నాటకమాడాడు.

పోలీసుల దర్యాప్తులో బయటపడ్డ అసలు విషయం

మస్తాన్ ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన కృష్ణలంక పోలీసులు బస్టాండ్ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలో, మస్తాన్ తన కూతురును ఆ మహిళ, ఆ పురుషుడికి అప్పగించడం, వారు ఆ బాలికను తీసుకుని విశాఖపట్నం వైపు వెళ్లడం కనిపించింది. ఈ దృశ్యాలను చూసి పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే అప్రమత్తమై, ఆ బాలికను విశాఖపట్నం తీసుకెళ్తున్నట్లు గుర్తించి, వారిని పట్టుకున్నారు.

ముగ్గురి అరెస్టు, బాలికకు రక్షణ

పోలీసులు తక్షణమే స్పందించి, బాలికను రక్షించి సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చారు. ఈ ఘటనకు సంబంధించి బాలిక తండ్రి మస్తాన్‌తో పాటు, కూతురిని కొనుగోలు చేసిన ఆ మహిళ, పురుషుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. డబ్బు కోసం కన్నబిడ్డను అమ్ముకోవడానికి సిద్ధపడిన తండ్రి చర్యపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ దారుణ ఘటన సమాజంలో మానవ సంబంధాలు ఎంత దిగజారాయో తెలియజేస్తోంది.

Read Also : Road Accident : రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5లక్షల తక్షణ సాయం!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870