12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ అమలు నిర్ణయం సరైంది కాదు
- సిపిఎం మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశకరత్
హైదరాబాద్ : జాతీయ ఎన్నికల కమిషన్ (ఇసిఐ) రాజకీయ ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకుంటోందని, 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను అమలు చేయాలని నిర్ణయించడం సరైంది కాదని సిపిఎం మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి(Election Commission) ప్రకాశ్కరత్ విమర్శించారు. ఎస్ఐఆర్పై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిందనీ, ఇంకా తుదితీర్పును వెల్లడిం చలేదని గుర్తు చేశారు. ఇసి స్వతంత్రంగా వ్యవహరిం చాలనీ, ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 23 నుంచి హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమైన సిపిఎం అఖిల భారతస్థాయి రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ప్రకాశ్కరత్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్టీ స్వతంత్ర బలాన్ని పెంచుకోవడంతో పాటు రాజకీయంగా, సైద్ధాంతికంగా బలోపేతం కావాలన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. రాజ్యాంగ వ్యవస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గుప్పె ట్లో పెట్టుకుందని విమ ర్శించారు. మోడీ ప్రభు త్వం అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు.
Read also: అంతర్వేది సమీపంలో తీరాన్ని దాటిన మొంథా

రాష్ట్రంలో పెండింగ్ ఫీజు బకాయిలు విద్యార్థుల ఆందోళన
12 రాష్ట్రాల్లో ఎస్ఐర్ నిర్వ హించాలని ఇసి(Election Commission) ప్రకటించిందని, రెండు నెలల క్రితం ఎస్ఐఆర్ను బీహార్ లో నిర్వహించిందని గుర్తుచేసిన ప్రకాశ్కరత్.. లౌకిక, ప్రతిపక్ష పార్టీలన్నీ ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశాయన్నారు. ఇసి తీరుపై అనుమానాలు వస్తున్నాయన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు సిద్ధాంత, రాజకీయ అవగాహనను పెంచడం కోసమే ఈ శిక్షణ తరగతులను నిర్వహించామని సిపిఎం పొలిట్బ్యూరో సభ్యుడు బివి రాఘవులు చెప్పారు. రాబోయే కాలంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా జరిగే పోరాటాలకు తమ పార్టీ శ్రేణులను సంసిద్ధం చేస్తామన్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి లను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30న విద్యార్థి సంఘాల రాష్ట్ర బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: