हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Dilsukhnagar: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుడు కేసులో ఇంకా పరారీలో ఉన్న మహమ్మద్ రియాజ్

Sharanya
Dilsukhnagar: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుడు కేసులో ఇంకా పరారీలో ఉన్న మహమ్మద్ రియాజ్

దేశం మొత్తాన్నీ వణికించిన దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుడు ఘటన కీలక మలుపు తిరిగింది. దీనిపై తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ఘటనలో అయిదుమంది దోషులకు మరణశిక్ష విధించడాన్ని హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే తుది ఆదేశాలు ఇచ్చింది. ఈ పేలుళ్ల వెనక ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌ ఉన్నట్లు స్పష్టమైంది. నిందితులుగా గుర్తించబడిన ఐదుగురిపై విచారణ, దర్యాప్తు, కోర్టు తీర్పుల అనంతరం చివరికి తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

హైకోర్టు సంచలన తీర్పు

దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు 2016లో ఐదుగురికి మరణశిక్ష విధించింది. వారు ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కానీ తాజాగా తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ (జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ పీ సుధలు) తీర్పును సమీక్షించి, ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థించింది. అంటే మరణశిక్ష కొనసాగుతుంది. ఇది బాధిత కుటుంబాలకు ఓ న్యాయం చేసినట్టే.

శిక్ష పడిన దోషులు వీరే

అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డి, జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వాఘాస్ / నబీల్ అహ్మద్, మహ్మద్ తహ్సీన్ అక్తర్ అలియాస్ హసన్, యాసిన్ భత్కల్ అలియాస్ షారుఖ్, అజాజ్ షేక్ అలియాస్ సమర్ అర్మాన్ తుండే, ఈ ఐదుగురిపై ఉగ్రవాద చట్టాలు, హత్య, కుట్ర, పేలుడు పదార్థాల చట్టాల కింద కేసులు నమోదు అయ్యాయి. వీరిని ఎన్ఐఏ స్వాధీనం చేసుకుని, వివరంగా విచారణ జరిపింది.

ప్రధాన నిందితుడు పరారీలో

కేసులో ప్రధాన సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ స్థాపకుడు మహ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ ఇప్పటికీ పరారీలో ఉన్నట్లు సమాచారం. అతను పాకిస్తాన్‌లోని కరాచీలో తలదాచుకున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. అతని అరెస్ట్‌తోనే ఈ కేసు పూర్తిగా మూసివేయబడి న్యాయం జరుగుతుంది. కేంద్రం అతని జాతీయ, అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్ కోసం కృషి చేస్తోంది. ఈ కేసు హైకోర్టులో దాఖలైన తర్వాత, 45 రోజులపాటు విచారణ జరిగింది. దర్యాప్తు అధికారులు, బాధితుల వాదనలు, నిందితుల పక్షాన వాదనలు అన్నీ విశ్లేషించిన అనంతరం న్యాయమూర్తులు తీర్పును రిజర్వ్ చేశారు. ఎట్టకేలకు ఇప్పుడు వారి తీర్పుతో ఈ కేసులో ఒక కీలక మలుపు తిరిగింది. ఈ పేలుళ్లలో గాయపడ్డ పలువురు బాధితులు ఇప్పటికీ శారీరకంగా, మానసికంగా బాధపడుతూనే ఉన్నారు. శాశ్వతంగా వికలాంగులుగా మారిన వారు, జ్ఞాపకాలు మరిచిపోలేని కుటుంబ సభ్యులు — ఇవన్నీ ఈ దారుణానికి గుర్తులే. వారికి జరిగిన నష్టం తిరిగి వచ్చే కాదు కానీ న్యాయమైన శిక్ష మాత్రం కొంత న్యాయం అందించినట్టయింది. ఈ తీర్పు ఉగ్రవాదంపై దేశం ఉక్కుపాదం మోపుతోందని ప్రపంచానికి చూపించేదిగా ఉంది. దేశంలోని ప్రతి పౌరుడి భద్రతకు పెద్ద ముప్పుగా ఉన్న ఉగ్రవాదంపై దీటైన చర్యగా ఇది పేర్కొనవచ్చు. ఉగ్రవాదాన్ని సహించేది లేదన్న సంకేతంగా ఈ తీర్పు నిలిచిపోతుంది. 2013 ఫిబ్రవరి 21వ తేదీన దిల్‌సుఖ్ నగర్‌లో సంభవించిన ఈ జంట పేలుళ్ల ఘటన యావత్ దేశాన్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనలో 18 మందికి పైగా మరణించారు. 131 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఇఫ్పటికీ చాలామంది కోలుకోవట్లేదు. కొందరు శాశ్వతంగా వికలాంగులయ్యారు.

Read also: Dilsukhnagar: వెంటాడుతున్న దిల్‌సుఖ్‌నగర్ జంట కేసులో ఆందోళన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870