ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం(Thalliki Vandanam Scheme)లో డబ్బులు తమ ఖాతాలో జమ కాలేదని అనేక మంది లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అర్హత కలిగి ఉండి కూడా డబ్బులు రానివారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. జూన్ 20వ తేదీ వరకు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఫిర్యాదులు స్వీకరించనున్నారు. గరిష్ఠంగా ఈ తేదీ లోపు సంబంధిత అధికారులు తమ వివరాలను సమర్పించమని సూచిస్తున్నారు.
వెరిఫికేషన్ తర్వాత అదనపు జాబితా
తరువాత జూన్ 28వ తేదీ వరకు అన్ని ఫిర్యాదులను పరిశీలించి, పునఃదృష్టి ఆధారంగా వెరిఫికేషన్ నిర్వహించి అదనపు అర్హుల జాబితా సిద్ధం చేస్తారు. ఈ ప్రక్రియలో నిబంధనలు నెరవేర్చిన, వాస్తవంగా అర్హత కలిగినవారిని జాబితాలో చేర్చనున్నారు. అధికారులు ప్రతి ఫిర్యాదునూ సమగ్రంగా పరిశీలించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
కొత్త జాబితా, డబ్బు జమ తేదీ
వెరిఫై చేసిన తర్వాత జూన్ 30న గ్రామ/వార్డు సచివాలయాల్లో కొత్త అర్హుల జాబితాను ప్రదర్శిస్తారు. చివరకు, జులై 5న ఈ జాబితాలో ఉన్న వారి బ్యాంక్ ఖాతాల్లో తల్లికి వందనం నిధులను జమ చేయనున్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది. కనుక ఇప్పటికీ డబ్బు రాకపోతే బాధితులు తమ గ్రామ సచివాలయాన్ని వెంటనే సంప్రదించి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Also ; Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి హైకోర్టులో దొరకని ఊరట