దేశ రాజధాని ఢిల్లీ భారీ పేలుడు (Delhi Blast) జరగడం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎర్రకోట (Red Fort) సమీపంలోని రద్దీ ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఓ కారులో శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai) తో పాటు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. దేశంలోని పలు నగరాల్లో కేంద్ర హోంశాఖ హై అలర్ట్ ప్రకటించింది.
Read Also: Delhi Blast : ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు బాంబ్ బ్లాస్ట్..
ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద కారులో ఈ పేలుడు సంభవించినట్లు స్థానికులు వెల్లడించారు.ఎర్రకోట గేట్ నంబర్ 1 వద్ద ఆపి ఉంచిన కారులో ఈ భారీ పేలుడు జరిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
సోమవారం సాయంత్రం 6.45 గంటలకు ఈ పేలుడు (Delhi Blast) సంభవించినట్లు తెలిపాయి. ఈ పేలుడు ధాటికి పక్కనే ఉన్న 8 కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ పేలుడుతో సమీపంలో ఉన్న షాపులు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఇప్పటిదాగా 8 మంది మృతి చెందగా.. వారి మృతదేహాలు ఛిద్రమైనట్లు స్థానికులు చెబుతున్నారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు
పేలుడు సంభవించగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.ఈ పేలుడులో అక్కడే ఉన్న పదుల సంఖ్యలో జనం తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే దగ్గర్లో ఉన్న ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గాయపడిన వారిని పేలుడు ప్రాంతం నుంచి బయటికి లాక్కొచ్చినట్లు స్థానికులు వెల్లడించారు.సమాచారం అందుకున్న వెంటనే ఉగ్రవాద నిరోధక దళం (యాంటీ-టెర్రర్ స్క్వాడ్), ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాయి.
పర్యాటకులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాన్ని
పర్యాటకులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.ఈ ఘటనతో ముంబై, ఉత్తర ప్రదేశ్ అప్రమత్తమయ్యాయి. ముంబైలోని కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి.
అదేవిధంగా, యూపీలోని అన్ని జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. సున్నితమైన ప్రాంతాల్లో గస్తీ, తనిఖీలను పెంచాలని లక్నో నుంచి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: