ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ‘తెలుగు నూతన సంవత్సరాది’ ఉగాది పర్వదినం సందర్భంగా అదిరిపోయే కానుకను ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన సుమారు 2.50 లక్షల మంది లబ్ధిదారుల ఇళ్లకు ఒకే రోజున ‘సామూహిక గృహ ప్రవేశాలు’ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పండుగ రోజున లక్షలాది కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలనే సంకల్పంతో సీఎం ఈ మెగా ఈవెంట్కు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని, లబ్ధిదారులందరికీ ప్రభుత్వం తరఫున అధికారికంగా ఆహ్వాన లేఖలు పంపాలని ఆయన అధికారులను ఆదేశించారు. పండుగ పూట సొంత ఇంటి కల నెరవేరుతుండటంతో పేద కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also : LPG cylinder theft : LPG సిలిండర్ల లారీ దొంగతనం, ఉత్తరప్రదేశ్లో షాక్
ఈ భారీ గృహ ప్రవేశాల వెనుక 2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనే ప్రభుత్వ భారీ లక్ష్యం దాగి ఉంది. కేవలం ఇళ్లు నిర్మించడమే కాకుండా, సకల మౌలిక వసతులతో కూడిన కాలనీలను అభివృద్ధి చేయాలని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ఉగాది కానుక ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవడమే కాకుండా, రాబోయే నాలుగేళ్లలో గృహ నిర్మాణ రంగాన్ని మరింత వేగవంతం చేయాలని భావిస్తోంది. పేదల సొంత ఇంటి కలను నిజం చేయడం ద్వారా అట్టడుగు వర్గాల్లో ప్రభుత్వానికి మంచి మైలేజీ లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం రాష్ట్ర చరిత్రలోనే ఒక రికార్డుగా నిలిచే అవకాశం ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :