పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ (LG) అహ్మద్ షరీఫ్ చౌదరీ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో “ఆపరేషన్ సిందూర్” (Operation Sindoor) సందర్భంగా చైనా తయారీ ఆయుధాలు అద్భుతంగా పనిచేశాయని వ్యాఖ్యానించారు. “మేం అన్ని రకాల సాంకేతికతను వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇటీవల చైనీస్ ప్లాట్‌ఫార్మ్‌లు అద్భుత సామర్థ్యాన్ని ప్రదర్శించాయి” అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో పాక్ రక్షణ రంగంలో చైనా ప్రభావం ఎంత బలంగా ఉందో మరోసారి బయటపడింది.
KTR : ఎన్నికల కమిషన్ పై KTR వ్యంగ్యాస్త్రాలు
చైనా(China)కు చెందిన PL-15 ఎయిర్ టు ఎయిర్ మిస్సైళ్లు, HQ-9P ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వంటి అత్యాధునిక ఆయుధాలను పాకిస్తాన్ ఇప్పటికే తన రక్షణ వ్యవస్థలో వినియోగిస్తోంది. ఇవి పాకిస్తాన్ వైమానిక దళం మరియు భూ సేనలో విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి. అయితే వీటిపై అంతర్జాతీయంగా విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది నిపుణులు ఈ ఆయుధాల సాంకేతికతను ప్రశంసిస్తుండగా, మరికొందరు వాటి విశ్వసనీయత, దీర్ఘకాలిక సామర్థ్యాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో భారత రక్షణ వ్యవస్థ చైనాకు చెందిన PL-15, HQ-9P వంటి మిస్సైళ్లను సమర్థవంతంగా నిర్వీర్యం చేసిన విషయం తెలిసిందే. ఆధునిక రాడార్ వ్యవస్థలు, ఇంటర్‌సెప్టర్ మిస్సైళ్లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ టెక్నాలజీలు ఉపయోగించి భారత రక్షణ బలగాలు ఈ మిస్సైళ్లను అడ్డుకోవడంలో విజయవంతమయ్యాయి. దీతో పాకిస్తాన్ వినియోగిస్తున్న చైనా ఆయుధాల పరిమితులు, భారత రక్షణ వ్యవస్థ సామర్థ్యం మరోసారి స్పష్టమవుతున్నాయి. ఈ పరిణామాలు దక్షిణాసియాలో రక్షణ రంగ పోటీని మరింత వేడెక్కిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/