Chinese woman arrested: భారత్–నేపాల్ సరిహద్దులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ చైనా మహిళను Border Security Force శనివారం అదుపులోకి తీసుకుంది. వీసా, పాస్‌పోర్ట్ లేకుండా అక్రమంగా భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ఆమె ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని Maharajganj district లో ఉన్న ఇండో–నేపాల్ సరిహద్దు ప్రాంతంలో చోటుచేసుకుంది.
సదరు మహిళ కాలినడకన సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా దళాల కంట పడింది. ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో సిబ్బంది ఆపి విచారణ చేపట్టారు. తనిఖీలో ఆమె వద్ద ఎలాంటి వీసా లేదా పాస్‌పోర్ట్ లేనట్లు తేలింది. దీంతో వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని స్థానిక Nautanwa Police Station పోలీసులకు అప్పగించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె వద్ద లభించిన (Chinese woman arrested) ఒక చిన్న స్లిప్ ఆధారంగా ఆమె పేరు హువాజియా జీగా, చైనాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై నౌతన్వా స్టేషన్ హౌస్ ఆఫీసర్ పురుషోత్తం రావు మాట్లాడుతూ, ఆ మహిళ చైనాలోని ఏ ప్రాంతానికి చెందినది, భారత్‌కు రావాలనుకున్న కారణం ఏమిటన్న అంశాలపై లోతైన విచారణ జరుగుతోందని తెలిపారు.
Read also: The RajaSaab box office : ది రాజాసాబ్ బాక్సాఫీస్ డే 1 అంచనా, ప్రభాస్ ఓపెనింగ్ ఎలా ఉండబోతోంది?
అయితే ఆ మహిళకు హిందీ లేదా ఇంగ్లీష్ రాకపోవడంతో విచారణలో కొంత ఇబ్బంది ఎదురవుతోందని అధికారులు పేర్కొన్నారు. ఆమె మాట్లాడే భాషను అర్థం చేసుకునేందుకు అవసరమైతే ట్రాన్స్‌లేటర్ల సహాయం తీసుకునే అవకాశముందని తెలిపారు.
ఇటీవలి కాలంలో నేపాల్ సరిహద్దు మార్గంగా చైనా పౌరులు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడం భద్రతా సంస్థలకు సవాలుగా మారిందని అధికారులు చెబుతున్నారు. ఈ మహిళ గూఢచర్యం కోసం వచ్చిందా లేక మరే ఇతర కారణాలున్నాయా అనే కోణంలో కేంద్ర నిఘా సంస్థలు కూడా దర్యాప్తు చేపట్టాయి. ప్రస్తుతం ఆమెపై ఫారినర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. గతంలో కూడా నకిలీ పత్రాలు, సన్యాసి వేషంలో చైనా గూఢచారులు దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఘటనలు ఉండటంతో, ఈ కేసును అధికారులు అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: