हिन्दी | Epaper

Telugu News: Trump-అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన చైనా

Pooja
Telugu News: Trump-అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన చైనా

గత శనివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బి వీసాలకు లక్ష డాలర్ల (భారతీయ కరెన్సీలో రూ.88లక్షలు)ను చెల్లించాలని నిబంధన విధించడంతో ఒక్కసారిగా ఐటి కంపెనీలు షాక్ గురయ్యాయి. ప్రత్యేకంగా భారతీయులు దీనిపై పెద్ద గందరగోళానికి గురయ్యారు. అయితే కొత్త వారికి మాత్రం ఇది వర్తిస్తుందని ట్రంప్ చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయినా ట్రంప్ నిర్ణయం భారతీయులకు పెద్ద దెబ్బే అని నిపుణులు చెబుతున్నారు.

తాజాగా అమెరికాకు చైనా బిగ్ షాక్ ఇచ్చింది. హెచ్1బి వీసాపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో చైనా వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. విదేశీ నిపుణుల కోసం చైనా కొత్త ప్లాన్ కు శ్రీకారం చుట్టింది. అమెరికా హెచ్1బి వీసా మాదిరిగా ‘కే వీసా’ విధానాన్ని తీసుకురానుంది. హెచ్1బి వీసా గందరగోళం మధ్య, ప్రపంచ నైపుణ్యాలను ఆకర్షించడానికి అక్టోబర్ 1 నుండి కే-వీసా(K-Visa) అనే కొత్త వీసా పథకాన్ని ప్రారంభించనటుంది.

Trump

స్పాన్సర్ షిప్ లేకుండానే వీసా

స్థానిక కంపెనీ స్పాన్సర్ షిప్(Sponsorship) కుండానే వీసా పొందే అవకాశం ఉంది. అమెరికాలో హెచ్1బి వీసా పొందడానికి ప్రయత్నిస్తున్న చాలామంది భారతీయ నిపుణులు, విద్యార్థులకు ఈ కే వీసా ఒక కొత్త అవకాశంగా మారవచ్చు అని నిపుణులు భావిస్తున్నారు. దీన్ని యుఎస్ హెచ్ 1బి వీసాకు పోటీగా అభివర్ణిస్తున్నారు నిపుణులు. వీసా ఫీజును యుఎస్ లక్ష డాలర్లకు పెంచడం చైనాకు కలిసొచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

ఎవరెవరు హెచ్ 1బికు దరఖాస్తు చేసుకోవచ్చంటే..

చైనా లేదా విదేశాలలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు లేదా పరిశోధనా సంస్థల నుంచి ఎస్టిఎం (స్టెమ్) రంగాలలో బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ డిగ్రీతో పట్టభద్రులైన వారు ఈ కే-వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అలాంటి సంస్థలో బోధన, పరిశోధనలో నిమగ్నమైన నిపుణులు కూడా ఈవీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. చైనాలో ప్రభుత్వం ఉన్న 12 సాధారణ వీసా వర్గాలతో పోలిస్తే, కే వీసా చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ఎక్కువ రోజుల కాలపరిమితి, ఎక్కువ సార్లు స్వదేశాలకు రాకపోకలు సాగించే వెసులుబాటు, రెన్యూవల్ సదుపాయం వంటి మరిన్ని ఫీచర్లను కే-వీసాకు జోడించారు. కాగా అమెరికా హెచ్1బి దరఖాస్తులపై లక్షడాటర్ల వార్షిక రుసుమును భారీగా విధించిందది. భారతీయ ఐటీ కంపెనీలు, టెక్ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.

అమెరికా హెచ్1బి వీసాపై ఏ మార్పు చేసింది?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, హెచ్1బి వీసా దరఖాస్తులపై లక్ష డాలర్ల (రూ.88 లక్షలు) ఫీజు విధించారు.

చైనా ఎలా స్పందించింది?
అమెరికా నిర్ణయానికి ప్రతిస్పందనగా చైనా ‘కే-వీసా’ అనే కొత్త వీసా పథకాన్ని అక్టోబర్ 1 నుండి ప్రారంభించనుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/huge-relief-for-the-people-during-the-festive-season/business/551686/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

పెట్రోల్ కొరత.. ఫేక్ వార్తలతో భారీగా స్టోర్ చేసుకుంటున్న జనం

పెట్రోల్ కొరత.. ఫేక్ వార్తలతో భారీగా స్టోర్ చేసుకుంటున్న జనం

మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు IEA గ్రీన్ సిగ్నల్..

400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు IEA గ్రీన్ సిగ్నల్..

వంట గ్యాస్ గుమ్మడికాయంత ధర..! సిలిండర్ రూ. 2800?

వంట గ్యాస్ గుమ్మడికాయంత ధర..! సిలిండర్ రూ. 2800?

యుద్ధం రూటు మారింది..ఇరాన్ భారీ ప్లాన్!

యుద్ధం రూటు మారింది..ఇరాన్ భారీ ప్లాన్!

కాలిఫోర్నియాపై దాడికి ఇరాన్ ప్లాన్?

కాలిఫోర్నియాపై దాడికి ఇరాన్ ప్లాన్?

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు!

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు!

అమెరికా ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన సూసైడ్ బోటు

అమెరికా ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన సూసైడ్ బోటు

ట్రంప్ ట్రేడ్ ఇన్వెస్టిగేషన్: భారత్‌కు ఎదురుదెబ్బ.. అమెరికాతో వ్యాపారం కష్టమేనా?

ట్రంప్ ట్రేడ్ ఇన్వెస్టిగేషన్: భారత్‌కు ఎదురుదెబ్బ.. అమెరికాతో వ్యాపారం కష్టమేనా?

📢 For Advertisement Booking: 98481 12870