ఉద్యోగంలో తొలిసారి అడుగుపెడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందించనుంది. EPFO (ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్)లో మొదటిసారి నమోదయ్యే ఉద్యోగులకు, నెలవారీ వేతనం రూ.15,000 లోపు ఉంటే ఈ పథకం ద్వారా ప్రయోజనం లభిస్తుంది. రూ. 1 లక్ష వరకు వేతనం కలిగిన ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు. ఇందులో రెండు విడతల్లో సహాయం అందుతుంది. మొదటి విడతను ఉద్యోగి ఉద్యోగంలో చేరి ఆరు నెలల తరువాత, రెండో విడతను ఉద్యోగి 12 నెలల పూర్తి సేవ తరువాత, ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాన్ని పూర్తి చేసిన తరువాత అందుకుంటారు. దీని ద్వారా పొదుపు అలవాటును ప్రోత్సహించే లక్ష్యంతో ఉద్యోగి నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేసి, ఆ కాలపరిమితి అనంతరం ఉపసంహరించుకునే వీలు కల్పిస్తారు. దేశవ్యాప్తంగా దాదాపు 1.92 కోట్ల మంది తొలిసారి ఉద్యోగంలో చేరే వారు ఈ పథకంలో లబ్ధి పొందనున్నారు.
యాజమాన్యాలకు ఉత్సాహకాలు
ఈ భాగం ద్వారా తయారీ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ, అన్ని రంగాల్లో కొత్త ఉద్యోగావకాశాలను పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రూ.1 లక్ష వరకు వేతనం ఉన్న ఉద్యోగులను నియమించే యాజమాన్యాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది. కనీసం ఆరు నెలల పాటు నిరంతరంగా ఉద్యోగాన్ని కొనసాగిస్తున్న యాజమాన్యాలకు మాత్రమే ఈ ప్రోత్సాహాలు వర్తిస్తాయి. కొత్తగా నియమించిన ప్రతి ఉద్యోగి కోసం రెండు సంవత్సరాల పాటు నెలకు గరిష్టంగా రూ.3,000 వరకు ప్రభుత్వం వాహన చేస్తుంది. ముఖ్యంగా తయారీ రంగానికి మూడవ మరియు నాలుగవ సంవత్సరాల్లోనూ ఈ ప్రోత్సాహాలు వర్తించనున్నాయి.
ఉద్యోగుల సంఖ్య ఆధారంగా మద్దతు పరిమాణం
EPFOలో నమోదు చేసుకున్న సంస్థలు ఉద్యోగుల సంఖ్య ఆధారంగా నిర్దిష్ట నిబంధనల మేరకు అదనపు ఉద్యోగులను నియమించాలి. ఉద్యోగుల సంఖ్య 50 కన్నా తక్కువయిన యాజమాన్యాలు కనీసం ఇద్దరిని నియమించాలి. 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న యాజమాన్యాలు కనీసం ఐదుగురిని నియమించాలి. అదనపు ఉద్యోగుల వేతన శ్రేణికి అనుగుణంగా యాజమాన్యాలకు నెలవారీగా నిబంధిత స్థాయిలో మద్దతును ప్రభుత్వం అందిస్తుంది. ఉదాహరణకు, వేతనం రూ.10,000 లోపు ఉంటే రూ.1,000 వరకు, రూ.10,000 – రూ.20,000 మధ్య ఉంటే రూ.2,000 వరకు, రూ.20,000 కంటే ఎక్కువ అయితే రూ.3,000 వరకు ప్రోత్సాహం లభిస్తుంది.
Read Also : Naidupeta: ఇంటి దొంగతనాలను ఛేదించిన పోలీసులు..