భారతీయులకు(Indians) విదేశాల్లో గౌరవం రానురాను సన్నగిల్లుతున్నది. భారతీయుల విశేషప్రతిభతో ప్రపంచం నలుదిక్కులా ఉపాధి అవకాశాలను పొందుతున్నారు. రాత్రీపగలు అనక కష్టపడి, తమ చదువుల్లో ప్రతిభను, నైపుణ్యాలను ప్రదర్శించి, న్యాయ బద్దంగా ఉద్యోగాల్లో ఎంపికై తమ మానాన బతుకుతున్న భారతీయులపై స్థానికుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. తాజాగా
కెనడాలో(Canada) భారతీయులపై జాత్యహంకార దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఓక్విల్ నగరంలోని మెక్డొనాల్డ్స్ ఔట్ భారతీయ ఉద్యోగిపై ఓ వ్యక్తి అత్యంత దారుణంగా జాత్యహంకార దూషణలకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Read Also: Viral News: పరువు తీశారు కదా! విదేశీ యూట్యూబర్‌పై పేడ చల్లిన వీడియో వైరల్

మీ దేశానికి వెంటనే తిరిగి వెళ్లిపో..
ఓ వ్యక్తి భారతీయ ఉద్యోగిని ఉద్దేశించి ‘వెంటనే నీ దేశానికి తిరిగి వెళ్లిపో.. అసహ్యకరమైన భారతీయుడా’ అంటూ అనుచిత పదజాలంతో దూసించాడు. అక్కడే ఉన్న ఓ మహిళ అతడిని అడ్డుకుని ప్రశ్నించగా, ఆమెపై కూడా ఆగ్రహం వ్యక్తి చేస్తూ తన దూషణలను కొనసాగించాడు. ఈ దృశ్యాలు కెమెరాల్లో రికార్డ్ అవకవడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘ఇది చాలా దారుణం. మా సమాజంలో ఇలాంటి వాటికి చోటు లేదు. ఆ ఉద్యోగి నిలబడటం అభినందనీయం’ అని ఒకరు వ్యాఖ్యానించారు.
కెనడాలో పెరుగుతున్న దాడులు
కెనడాలో భారతీయులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దాడులు జరగడం దే మొదటిసారి కాదు. ఈనెల ప్రారంభంలోనే అంటారియో ప్రావిన్స్ చట్టసభ సభ్యుడు హర్ దీప్ గ్రేవాల్ పై ఇద్దరు వ్యక్తులు జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ‘హే టర్బన్ వాడ్, మీ ఇంటికి వెళ్లు. మీరంతా చనిపోవాలి’ అంటూ ఆయనపై విరుచుకుపడ్డారు.
ఈ ఘటన ఎక్కడ జరిగింది?
కెనడాలో ఒక భారతీయుడిని ఉద్దేశించి ఈ జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలకు కారణం ఏమిటి?
తమ దేశంలో భారతీయులు ఉండటం పట్ల ఆ కెనడా యువకుడు జాత్యహంకారంతో ఈ వ్యాఖ్యలు చేశాడు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: