हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

sumalatha chinthakayala
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జనవరి 31వ తేదీన మొదలై ఫిబ్రవరి 13వ తేదీ వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. రెండవ విడత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి. మార్చి 10వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. ఈ నెల 31న పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26కి సంబంధించిన పద్దును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈసారి కూడా బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి.

image
Budget meeting of the Parliament has been finalized

ఆ తర్వాతి రోజు అంటే ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్ ప్రవేశపెడతారు. ప్రధాన మంత్రి నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. ఈసారి బడ్జెట్‌పై కోటి ఆశలు పెట్టుకున్నారు మధ్య తరగతి ప్రజలు. కాగా, రూ.10 లక్షల వరకు పన్ను మినహాయింపులు ఇవ్వాలని ట్రేడ్ యూనియన్లు ఇప్పటికే కేంద్రానికి సూచించిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల కోసం ఇప్పటికే 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దానికి సంబంధించిన విధి విధానలపై బడ్జెట్‌లో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఫిబ్రవరి 1వ తేదీన ఎలాంటి ప్రకటనలు చేస్తారో వేచి చూడాల్సిందే.

ఇకపోతే..ఆర్థిక మంత్రిగానూ నిర్మలా సీతారామన్ రికార్డ్ సృష్టించనున్నారు. వరుసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిలువనున్నారు. దీంతో రెండు మధ్యంతర బడ్జెట్లు, 6 పూర్తి స్థాయి బడ్జెట్లను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినవారు అవుతారు. ఆమె కంటే ముందు అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రుల్లో మొరార్జీ దేశాయ్ 10 సార్లు అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత పి.చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలాగే అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870