బీహార్‌లో(Bihar Results) ఈసారి కూడా ముఖ్యమంత్రి పదవి నితీశ్ కుమార్‌కే దక్కే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన లెక్కింపుల ప్రకారం జేడీయూ భారీ ఆధిక్యంతో ముందంజలో ఉంది. మొత్తం 82 స్థానాల్లో ముందుండటం ఆ పార్టీకి పెద్ద ప్లస్‌గా మారింది. జేడీయూను అనుసరిస్తూ బీజేపీ 78 సీట్లలో ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ఈ ఫలితాల ఆధారంగా చూస్తే మొత్తంగా ఎన్డీయే స్పష్టమైన మెజార్టీ సాధించే అవకాశం ఖాయం. అదే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. అయితే సీఎం కుర్చీ మాత్రం జేడీయూ నాయకత్వం కే దక్కనుందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.
Read Also: Bihar Elections: జైలు నుంచే లీడ్ – అనంత్ సింగ్ మోకామాలో ఆధిపత్యం
బీజేపీ ఆశలకు దెబ్బ
ఈ ట్రెండ్స్ బీజేపీకి కొంత నిరాశను మిగులుస్తున్నాయి. కారణం ఎన్నికలకు ముందు ఎన్డీయే కూటమి తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. ఫలితాలు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. మరోవైపు బీజేపీ శ్రేణులు 74 ఏళ్ల నితీశ్ కుమార్‌కు మరో అవకాశం ఇవ్వాలనే అభిప్రాయంలో లేనట్లు ప్రచారం జరిగింది.
Bihar Results: హోంమంత్రి అమిత్ షా కూడా గతంలో మాట్లాడుతూ, “ఎన్నికల తర్వాత ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు కలిసి తమ నాయకుడిని ఎన్నుకుంటాయి” అని వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో నితీశ్‌కు బీజేపీ పక్కదారి వేస్తుందనే ఊహాగానాలు వేగంగా పాకాయి. ఈ వార్తలను బీజేపీ ఖండించినప్పటికీ, “మా సీఎం అభ్యర్థి నితీశ్ కుమారే” అని స్పష్టంగా ప్రకటించలేదు.
అసలు బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ ధీమాగా ఉండి, సీఎం పదవి తమవే అవుతుందని అంచనా వేసింది. కానీ ఓటర్లు మరోసారి నితీశ్ నేతృత్వాన్నే నమ్మినట్లు ట్రెండ్స్ చెబుతున్నాయి. జేడీయూ ముందంజలో ఉంటున్న నేపథ్యంలో సీఎం పదవిపై బీజేపీకి పెద్దగా చెప్పుకునే స్కోప్ కనిపించడం లేదు. ఫైనల్ కౌంటింగ్ ముగిసినా ఇదే పరిస్థితి ఉంటే, నితీశ్ కుమార్‌కు మరొకసారి ముఖ్యమంత్రి పదవి ఖాయం అంటున్నారు రాజకీయ నిపుణులు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: