జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం రోజురోజుకీ వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి మరియు బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఆయన మాట్లాడుతూ, ఈ రోజు సాయంత్రం బోరబండలో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. “ఎవరు అడ్డుకుంటారో చూద్దాం, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలి. సాయంత్రం బీజేపీ దమ్మేంటో తెలంగాణకు చూపిద్దాం” అని సంజయ్ పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఉపఎన్నికలో చివరి దశ ప్రచారాన్ని మరింత ఉధృతం చేయడానికి బండి సంజయ్ ఈ రీతిలో సవాల్ విసరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Latest News: T20 World Cup 2026: ఫైనల్ వేదిక ఫిక్స్..ఎక్కడంటే?
అయితే బోరబండలో ఆయన మీటింగ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారన్న ప్రచారం సోషల్ మీడియాలో విస్తరించింది. దీనిపై స్పందించిన బండి సంజయ్, “మా మీటింగ్‌కు అడ్డుపడేందుకు కుట్ర జరుగుతోంది” అని ఆరోపించారు. “బీజేపీ ప్రజా మద్దతు పెరుగుతోందని భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఆటంకాలు సృష్టిస్తోంది. కానీ ప్రజాస్వామ్యంలో ఎవరూ బీజేపీని అడ్డుకోలేరు” అని ఆయన అన్నారు. కార్యకర్తల ఉత్సాహాన్ని తగ్గించే ప్రయత్నాలు విఫలమవుతాయని, తాము శాంతియుతంగా ప్రజా సమావేశం నిర్వహించబోతున్నామని స్పష్టం చేశారు.

ఇక ఈ విషయంపై పోలీసు అధికారులు వివరణ ఇచ్చారు. బోరబండలో బండి సంజయ్ సభకు అనుమతి రద్దు చేశామనేది తప్పుడు సమాచారం అని వారు తెలిపారు. “ఇప్పటి వరకు బీజేపీ తరఫున ఎవరూ అనుమతి కోసం దరఖాస్తు చేయలేదు. కాబట్టి అనుమతి రద్దు చేసే ప్రశ్నే రాదు” అని పోలీసులు స్పష్టం చేశారు. ఈ వివరణతో బోరబండ మీటింగ్‌పై స్పష్టత రావడంతో, రాజకీయ వర్గాల్లో ఆసక్తి మరింత పెరిగింది. బండి సంజయ్ సభతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం కొత్త మలుపు తిరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/