हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

AP High Court : అంబటి రాంబాబు పై దాడి.. ఏపీ హైకోర్టు సీరియస్‌

Sudheer
AP High Court : అంబటి రాంబాబు పై దాడి.. ఏపీ హైకోర్టు సీరియస్‌

తిరుమల లడ్డూ కల్తీ అంశంపై గుంటూరులో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రాజకీయ చిచ్చుకు కారణమయ్యాయి. ఈ ఫ్లెక్సీలను తొలగించేందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు స్వయంగా రంగంలోకి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు ఆయనను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబంపై అంబటి చేసిన వ్యాఖ్యలు మంటను మరింత రాజేశాయి. ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు అంబటి నివాసంపై రాళ్లు, కర్రలతో దాడి చేసి కార్లను, ఇంటి అద్దాలను ధ్వంసం చేయడమే కాకుండా, నిప్పు పెట్టడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

Motor accident compensation : ప్రమాద బాధితులకు శుభవార్త, వడ్డీపై పన్ను పూర్తిగా రద్దు!

24 గంటల భద్రతకు ఆదేశం తమ నివాసంపై దాడి జరగడం మరియు అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేయడంతో ఆయన భార్య విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆమె కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. శాంతిభద్రతలు పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకు అంబటి కుటుంబానికి 24 గంటల పాటు నిరంతర పోలీసు భద్రత కల్పించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

AP HC
AP HC

అంబటి రాంబాబుపై పోలీసులు మూడు వేర్వేరు కేసులు నమోదు చేసి ఆయన్ను అదుపులోకి తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రిని దూషించడం, విధుల్లో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించడం వంటి సెక్షన్ల కింద ఆయనను అరెస్టు చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తనపై టీడీపీ శ్రేణులు హత్యా ప్రయత్నం చేశాయని అంబటి ఆరోపిస్తుండగా, అధికార పార్టీ నేతలు మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేస్తున్నారు. ఈ వరుస దాడులు, అరెస్టుల నేపథ్యంలో గుంటూరులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870