టెక్నాలజీ వినోదానికి మాత్రమే కాకుండా, ప్రాణాలను రక్షించడంలోనూ ఎంత కీలకమో మరోసారి నిరూపితమైంది. ముంబైకు చెందిన 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ క్షితిజ్ జోడాపే,(Kshitij Jodape,) పుదుచ్చేరి తీరంలో స్కూబా డైవింగ్ చేస్తుండగా ప్రమాదంలో చిక్కుకున్నాడు. అయితే అతని చేతికి ఉన్న ఆపిల్ వాచ్ అల్ట్రా సకాలంలో స్పందించి ప్రాణాపాయం నుంచి రక్షించింది.
Read Also: Flight Services:ఇక ఆ దేశానికి డైరెక్ట్ విమాన సర్వీసులు

ప్రమాదం ఎలా జరిగింది?
క్షితిజ్ దాదాపు 36 మీటర్ల లోతులో డైవింగ్ చేస్తుండగా, అనుకోకుండా అతని వెయిట్ బెల్ట్ ఊడిపోయింది. నీటిలో సంతులనం కోసం ఇది అత్యంత అవసరం. బెల్ట్ తప్పిపోవడంతో క్షితిజ్ వేగంగా పైకి తేలిపోతున్నాడు. ఇంత వేగంగా ఉపరితలంపైకి రావడం వల్ల ‘డీకంప్రెషన్ సిక్‌నెస్’‘(Decompression sickness’) అనే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపించి ప్రాణాంతకంగా మారవచ్చు.
ఆపిల్ వాచ్ ఎలా సహాయపడింది?
క్షితిజ్ వేగంగా పైకి వస్తుండగా, అతని ఆపిల్ వాచ్ అల్ట్రా లోని డైవ్ డెప్త్ సెన్సార్ ఈ అసాధారణ మార్పును గుర్తించింది. వెంటనే అత్యవసర హెచ్చరికలు పంపడంతో పాటు సైరన్ అలారం కూడా మోగించింది. నీటిలో సైరన్ శబ్దం స్పష్టంగా వినిపించడంతో అతని డైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ అప్రమత్తమై వెంటనే వెనక్కి ఈదుతూ క్షితిజ్‌ను కంట్రోల్ చేశాడు. దీంతో అతన్ని నెమ్మదిగా పైకి తీసుకువచ్చి ప్రాణాపాయం నుంచి బయటపెట్టాడు.
ఈ సంఘటన తర్వాత క్షితిజ్ స్వయంగా ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌కు లేఖ రాయగా, టిమ్ కుక్ స్పందిస్తూ – “మీ ఇన్‌స్ట్రక్టర్ అలారం విని వెంటనే సహాయం చేసినందుకు సంతోషంగా ఉంది” అని తెలిపారు.
క్షితిజ్ ఏ సమయంలో ప్రమాదంలో చిక్కుకున్నాడు?
పుదుచ్చేరి తీరంలో 36 మీటర్ల లోతులో స్కూబా డైవింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది.
వెయిట్ బెల్ట్ ఊడిపోతే ఏమవుతుంది?
డైవర్ సంతులనం కోల్పోయి వేగంగా పైకి తేలిపోతాడు, ఇది ‘డీకంప్రెషన్ సిక్‌నెస్’కు దారి తీస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: