ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణతో పాటుగా ప్రజల ఆరోగ్యం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు(AP) సొంత నియోజకవర్గం కుప్పంలో “స్వచ్ఛాంధ్ర”, “స్వర్ణాంధ్ర” పథకాల క్రింద 5వేల ఇ-సైకిళ్లను మొదటి విడతగా అందుబాటులోకి తెస్తున్నారు. సైకిళ్ల ధర రూ.23,999 కాగా, రూ.5,000 ముందుగా చెల్లించగానే మిగతా మొత్తం బ్యాంక్ లోన్ ద్వారా సులభంగా చెల్లించవచ్చు. సైకిల్ ఉపయోగించడం ద్వారా పెట్రోల్ ఖర్చు తగ్గిపోతుంది, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు వాయు, శబ్ద కాలుష్యం కూడా తగ్గుతుంది.
Read also: పాలు లేకుండా నెయ్యి తయారీ?

లబ్ధిదారుల ఎంపిక , పంపిణీ విధానం
ఈ సైకిళ్ల(AP) కోసం దరఖాస్తులు స్థానిక గ్రామ, వార్డు సచివాలయాల్లో స్వీకరిస్తారు. అబ్బాయిలు, అమ్మాయిల కోసం వేర్వేరు సైకిళ్లు అందుబాటులో ఉంటాయి. ముఖ్యమంత్రి జనవరిలో కుప్పం లో పర్యటిస్తుండగా లబ్ధిదారులకు ప్రత్యక్షంగా సైకిళ్లు అందజేయాలని భావిస్తున్నారు. ఈ-సైకిళ్లు 40 కిలో మీటర్ల దూరాన్ని ఒక యూనిట్ విద్యుత్‌తో సులభంగా ప్రయాణించగలవు. అదనంగా, కుప్పం ప్రాంతంలో నారావారిపల్లెలో సోలార్ ప్యానల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రోత్సహిస్తున్నట్లు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ప్రకటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: