Bullet train : ఆంధ్రప్రదేశ్‌కు హైస్పీడ్ రైలు సేవలపై కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. విజయవాడ-విశాఖపట్నం మధ్య బుల్లెట్ రైలు నడపడానికి హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రతిపాదనను రైల్వే శాఖ పరిశీలిస్తోంది. తుది మార్గ నిర్ధారణ (ఫైనల్ లొకేషన్ సర్వే) కోసం అనుమతి కోరినట్లు సమాచారం. బోర్డు ఆమోదం లభిస్తే సర్వే ప్రక్రియ ప్రారంభమవుతుంది.
దాదాపు 350 కిలోమీటర్ల పొడవున్న ఈ కారిడార్ ఏలూరు, రాజమహేంద్రవరం, కాకినాడ మార్గంగా వెళ్లేలా ప్రణాళిక సిద్ధమవుతోంది. గంటకు సుమారు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు అందుబాటులోకి వస్తే విజయవాడ-వైజాగ్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.
Read Also: Shadnagar Raikal Lake: హోలీ వేళ విషాదం.. ఈతకు వెళ్లి గురుకుల విద్యార్థి గల్లంతు

అదే సమయంలో విజయవాడ-కర్నూల్ మధ్య సెమీ హైస్పీడ్ కారిడార్ ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఏడు హైస్పీడ్ కారిడార్లలో హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, చెన్నై-బెంగళూరు మార్గాలు కూడా ఏపీ మీదుగా ఉండనున్నాయి. ఈ పరిణామాలతో రాష్ట్ర రవాణా రంగంలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశముంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: