Anantapur crime news : అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లి–కొడుకులను అత్యంత అమానుషంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శింగనమల మండలం తరిమెల గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది.
పోలీసుల వివరాల ప్రకారం, తరిమెల గ్రామానికి చెందిన నల్లప్ప మృతి తర్వాత ఆస్తి పంపకాల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నల్లప్ప రెండో భార్య యల్లమ్మ (38), ఆమె కుమారుడు చిన్నా (22) ఇంట్లోనే హత్యకు గురయ్యారు. యల్లమ్మ అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తుండగా, చిన్నా స్థానికంగా ఉపాధి పనులు చేసేవాడని సమాచారం.
Read Also: AP: నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్

ఆస్తి తగాదాలే ఈ జంట హత్యలకు ప్రధాన కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మొదటి భార్యకు చెందిన కుటుంబ సభ్యులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: