ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో గుంటూరులోని నల్లపాడు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గుంటూరులోని అంబటి నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేయడంతో పాటు, ఆయన ఇంటి పరిసరాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి పంపిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో గుంటూరులో ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొంది.
Vasundhara Yadav : అప్పుడు మోనాలిసా..ఇప్పుడు ఏసీపీ వసుంధర..సోషల్ మీడియా లో ట్రేండింగ్
ఈ వివాదం తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై వెలిసిన ఒక ఫ్లెక్సీతో మొదలైంది. ఆ ఫ్లెక్సీని తొలగించే క్రమంలో అంబటి రాంబాబు మరియు టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సమయంలో ముఖ్యమంత్రిని ఉద్దేశించి అంబటి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపాయి. దీనిపై అంబటి స్పందిస్తూ.. తాను ఉద్దేశపూర్వకంగా విమర్శించలేదని, తనపై దాడి జరగడం వల్లే ఆవేశంలో అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ, చట్టప్రకారం తనను అరెస్టు చేయాలనుకుంటే దానికి తాను సిద్ధంగా ఉన్నానని, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా భారీగా అక్కడకు చేరుకుంటున్నాయి. మరోవైపు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంబటికి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రతిపక్ష నేతలపై దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆయన విమర్శించారు. ఏ క్షణమైనా అంబటిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉండటంతో, పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నందినగర్ పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com