हिन्दी | Epaper
భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్ యూజర్లకు జియో శుభవార్త RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక కార్ల రికార్డు బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు కెనరా బ్యాంక్ కొత్త యాప్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్ యూజర్లకు జియో శుభవార్త RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక కార్ల రికార్డు బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు కెనరా బ్యాంక్ కొత్త యాప్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్ యూజర్లకు జియో శుభవార్త RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక కార్ల రికార్డు బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు కెనరా బ్యాంక్ కొత్త యాప్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్ యూజర్లకు జియో శుభవార్త RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక కార్ల రికార్డు బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు కెనరా బ్యాంక్ కొత్త యాప్

Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేస్తుందోచ్ !!

Sudheer
Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేస్తుందోచ్ !!

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగదారులకు గ్రేట్ సమ్మర్ సేల్ 2025ను అధికారికంగా ప్రకటించింది. మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ సేల్, ప్రైమ్ సభ్యులకు మాత్రం ఒక రోజు ముందుగానే అంటే ఏప్రిల్ 30 అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి రానుంది. వేసవిలో తాపాన్ని తగ్గించేందుకు వినియోగదారులకు అందించే ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఏసీలు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్స్ వంటి అనేక గ్యాడ్జెట్లు అద్భుతమైన ధరలకు లభించనున్నాయి.

భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక డీల్స్

అమెజాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహోపకరణాలు, కిచెన్ ఉత్పత్తులు మొదలైన అనేక కేటగిరీలపై భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక డీల్స్ లభించనున్నాయి. శాంసంగ్, షామీ, వన్‌ప్లస్ వంటి టాప్ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే, లేటెస్ట్ టెక్నాలజీ గ్యాడ్జెట్లు కొనుగోలు చేయాలని భావిస్తున్నవారికి ఇది గొప్ప అవకాశం.

HDFC బ్యాంక్ కస్టమర్లు ప్రత్యేక లాభాలు

బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే.. HDFC బ్యాంక్ కస్టమర్లు ప్రత్యేక లాభాలు పొందనున్నారు. HDFC క్రెడిట్ కార్డు లేదా EMI లావాదేవీల ద్వారా కొనుగోలు చేసిన వారికి 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా, నో-కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, ఉచిత డెలివరీ, సులభమైన రిటర్న్ పాలసీ, క్యాష్ ఆన్ డెలివరీ వంటి సౌకర్యాలు కూడా ఉంటాయని అమెజాన్ ప్రకటించింది. ఈ వేసవిలో సరసమైన ధరలకు అవసరమైన వస్తువులు కొనాలనుకునే వినియోగదారులకు ఇది చక్కటి అవకాశం అని చెప్పవచ్చు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870