విజయవాడ : రాజధాని (Amaravati) వరద నివారణ ప్రణాళికలో భాగంగా రెండో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) సోమవారం టెండర్ ప్రకటన విడుదల చేసింది. మొత్తం రూ.595 కోట్ల వ్యయంతో(పన్నులతో కలిపి) 8400 క్యూసెక్కుల సామర్థ్యంతో ఈ పంపింగ్ స్టేషన ను నిర్మిస్తారు. ఉండవల్లి వద్ద 2014-19 మధ్య నిర్మించిన మొదటి పంపింగ్ స్టేషన్కు పక్కనే దీన్ని నిర్మిస్తారు. పంపింగ్ స్టేషన్ ను గుత్తేదారు సంస్థే 15 ఏళ్ళ పాటు నిర్వహించేలా టెండర్ నిబంధన రూపొందించారు. ఇప్పుడు కట్టబోయే పంపింగ్ స్టేషన్లో ఒక్కొక్కటి 6వేల హార్పరవ్ 13 మోటార్లు సామర్థ్యం ఉంటాయి. కొండవీటి వాగు రాజధాని అమరావతి మీదుగా వెళ్ళి ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదిలో(Krishna River) కలుస్తుంది. అమరావతికి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో పాటు, పాలవాగు వంటి ఇతర చిన్న వాగులు, వంకలు కూడా కొండవీటి వాగులో కలుస్తాయి. కృష్ణా నదికి వరద లేనప్పుడు… కొండవీటి వాగు కూడా ఉదృతంగా ప్రవహిస్తే ఆ నీను కృష్ణానదిలో కలవకుండా వెనక్కి తన్నుతుంది. అలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు రాజధాని ప్రాంతం ముంపునకు గురి కాకుండా ఉండేందుకు వరద నివారణ ప్రణాళికను సీఆర్డీఏ తయారు చేసింది. కొండవీటి వాగుకు తీవ్ర స్థాయిలో వరద పోటెత్తితే గరిష్టంగా 23 వేల క్యూసెక్కుల జలాలు వస్తాయని అంచనా.
Read also: రైతులకు శాపంగా మారిన ప్రజాపాలన

మూడుదశల్లో వరద నియంత్రణ పంపింగ్ స్టేషన్లు
వాటిని కృష్ణానది లోకి ఎత్తిపోసేందుకు మూడు పంపింగ్ స్టేషన్లు అవసరమవుతాయని ప్లాన్ చేశారు. ఈ మేరకు మొదటిది ఉండవల్లి వద్ద 5,000 క్యూసెక్కుల సామర్థ్యంలో 2019కి ముందే నిర్మించారు. ఇప్పుడు 8,400 క్యూసెక్కుల సామర్థంతో రెండో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. మూడో పంపింగ్ స్టేషన్ ను వైకుంఠపురం వద్ద 8,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే సామర్థంతో నిర్మిస్తారు. ప్రకాశం(Amaravati) బ్యారేజి సమీపంలో కొండవీటి వాగు, గుంటూరు ఛానలైపై ప్రస్తుతం ఉన్న బ్రిడ్జికి సమాంతరంగా… రెండు వరసల బ్రిడ్జి, షిప్క్ నిర్మాణానికి రూ.55.85 కోట్ల అంచనా వ్యయంతో ఏడీసీ టెండర్లు పిలిచింది. కృష్ణా కరకట్ట మీదుగా రాజధాని లోకి రాకపోకలు ప్రస్తుతం ఈ బ్రిడ్జి మీదుగానే సాగుతున్నాయి. కరకట్ట రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలన్నది ప్రతిపాదన. దానికి తగ్గటుట్టగా నాలుగు వరుసల బ్రిడ్జిపలు కూడా అవసరం. ఇందులో భాగంగా తొలుత రెండు వరుసల బ్రిడ్జి నిర్మిస్తారు. అది అందుబాటులోకి వచ్చాక… ప్రస్తుతం ఉన్న సన్నటి బ్రిడ్జిని తొలగించి.. అక్కడ రెండు వరుసలతో బ్రిడ్జి నిర్మిస్తారు. రాజధానిలో అభివృద్ధి చేస్తున్న కాలువల్లో జల విహారానికి కూడా సీఆర్డీఏ ఏర్పాటు చేస్తోంది. రాజధాని లోని కాలువల్లోంచి బోట్లు కృష్ణానదిలోకి వెళ్ళేందుకు వీలు గా.. ఇప్పుడు నిర్మించనున్న బ్రిడ్జికి షిప్క్ ఏర్పాటు చేయనున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also :