हिन्दी | Epaper

ప్రధాని మోదీని కలిసిన అక్కినేని కుటుంబం

Sukanya
ప్రధాని మోదీని కలిసిన అక్కినేని కుటుంబం

నటుడు అక్కినేని నాగార్జున తన కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఆయనతో పాటు అమల అక్కినేని, అలాగే ఇటీవల పెళ్లి చేసుకున్న కొత్త జంట నాగ చైతన్య, శోభిత ధూళిపాల కూడా ప్రధానమంత్రిని కలవడానికి పార్లమెంటును సందర్శించారు. అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్రపై రాబోయే పుస్తకం గురించి వారు మోదీతో చేర్చించినట్లు తెలుస్తుంది. వారి పర్యటన సందర్భంగా పార్లమెంటు ప్రాంగణాన్ని కూడా సందర్శించారు. సందర్శన అనంతరం వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రధాని మోదీని కలిసిన అక్కినేని కుటుంబం

ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ, అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రస్తావిస్తూ, భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలను ప్రశంసించారు. ఈ వ్యాఖ్యల తర్వాత, అక్కినేని కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీ వెనుక మరేదైనా ముఖ్యమైన కారణం ఉందా అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. సినీ రంగానికి సంబంధించి ప్రభుత్వ సహకారం గురించి కూడా వారు చర్చించి ఉండవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. మరోవైపు, నాగ చైతన్య, శోభిత ధూళిపాల కలిసి మోదీని కలవడం ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై వీరిద్దరూ ఇప్పటి వరకు స్పందించలేదు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా

పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా

బాయ్‌ఫ్రెండ్‌తో మోనాలిసా జంప్, పోలీసుల వద్ద ఆశ్రయం

బాయ్‌ఫ్రెండ్‌తో మోనాలిసా జంప్, పోలీసుల వద్ద ఆశ్రయం

‘తండేల్’ చిత్రానికి గద్దర్ ఫిల్మ్ అవార్డు.. ప్రభుత్వానికి చైతూ కృతజ్ఞతలు

‘తండేల్’ చిత్రానికి గద్దర్ ఫిల్మ్ అవార్డు.. ప్రభుత్వానికి చైతూ కృతజ్ఞతలు

అది ఎంగేజ్‌మెంట్ కాదు – బెల్లంకొండ శ్రీనివాస్ క్లారిటీ

అది ఎంగేజ్‌మెంట్ కాదు – బెల్లంకొండ శ్రీనివాస్ క్లారిటీ

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

మహిళా దినోత్సవం వేళ అమ్మకు ఖరీదైన కానుక

మహిళా దినోత్సవం వేళ అమ్మకు ఖరీదైన కానుక

ఓటీటీలోకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. డేట్ ఫిక్స్!

ఓటీటీలోకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. డేట్ ఫిక్స్!

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ఉస్తాద్’ సంచలనం!

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ఉస్తాద్’ సంచలనం!

విజయ్‌కు మూడోసారి సీబీఐ నోటీసులు

విజయ్‌కు మూడోసారి సీబీఐ నోటీసులు

“జగన్ గారు… నా జోలికి రావద్దు.. శివాజీ

“జగన్ గారు… నా జోలికి రావద్దు.. శివాజీ

బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్‌మెంట్, వధువు ఎవరో తెలుసా?

బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్‌మెంట్, వధువు ఎవరో తెలుసా?

ట్రంప్‌కు కమల్ హాసన్ కౌంటర్

ట్రంప్‌కు కమల్ హాసన్ కౌంటర్

📢 For Advertisement Booking: 98481 12870