ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. (Afghanistan) ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు ప్రమాదం బారినపడి పాణాలు కోల్పోతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం, మద్యం మత్తు, నిద్రమత్తు.. ఇలా కారణాలు ఏవి అయితేనేం క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్లోని పశ్చిమ హెరాత్ ప్రావిన్స్ లో కూడా ఇలాంటి ఘోర ప్రమాదం జరిగింది. (Afghanistan) ఈ ప్రమాదంలో ప్రయాణీకులందరూ మరణించారు. బస్సు అదుపు తప్పడం వల్లే ప్రమాదానికి కారణంగా తెలుస్తున్నది.
71మంది సజీవ దహనం
కాబూలు బహిష్కరించిన వలసదారులను తీసుకెళ్తున్న బస్సు ఓ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అందులో ఉన్న 71 మంది పూర్తిగా సజీవ దహనమయ్యారు. వీరిలో 17మంది పిల్లలు కూడా ఉన్నారు. బస్సు డ్రైవర్ అతివేగం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. క్షణాల్లో బస్సు మొత్తం కాలి
పోయింది. ఇందులో ఉన్న ప్రయాణీకులు కూడా సజీవ దహనం కావడం తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నది.
పూర్తి సమాచారం తెలియదు
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ఏమైనా కుట్రకోణం ఉందా అనే అనుమానాలకు కూడా తావు ఇస్తున్నది. 71మంది ప్రయాణికులను తీసుకెళుతున్న డ్రైవర్ అంత వేగంగా బస్సును ఎందుకు డ్రైవ్ చేయాల్సి వచ్చింది? ప్రయాణికుల్లో ఎవరూ తప్పించుకోలేకపోయారు? అందరూ మరణించడంపై కూడా అధికారులు
లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుని కాలిపోవడంతో సమీపంలోని ప్రజలు ఏమైందో తెలియక భయంతో వణికిపోయారు.
Read also: