— ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్
హైదరాబాద్: తెలంగాణలో విద్య, ఉద్యోగం, రాజకీయ అవకాశాలు పెంపొందించడానికి బిసిలకు 42శాతం రిజర్వేషన్ పెంపు కోసం బిజెపి హైకమాండ్పై ఒత్తిడి తీసుకొచ్చి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడానికి ఆ పార్టీ బిసి నేతలు నోరు విప్పాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi srinivas) డిమాండ్ చేశారు. మంగళవారం సిఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు (Ramachandra Rao) వైఖరీలో బిసి రిజర్వేషన్ వ్యతిరేకంగా కనిపిస్తున్నదని అన్నారు. రాంచంద్రరావు బిసి రిజర్వేషన్లను ఆహ్వానిస్తున్నామని రాష్ట్రంలో చెపుతూ ఢిల్లీ వెళ్లగానే మాట మారుస్తున్నాడని ఆరోపించారు. బిసి రిజర్వేషన్ లపైన మా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని పశ్నించే నైతిక హక్కు బిజెపి కి లేదని ఆయన అన్నారు.
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలి: ఆది శ్రీనివాస్
బిసి రిజర్వేషన్ల పైన మా చిత్తశుద్దిని మేం నిరూపించుకు న్నామని. 42 శాతం రిజర్వేషన్ల కోసం పకడ్బందీగా కులగణన చేశామని మంత్రి వర్గంలో ఆమోదించామని అసెంబ్లీలో చట్టం చేశాం గవ ర్నర్ దగ్గర నివేదించామని ఆది శ్రీనివాస్ (Adi srinivas) వివరించారు. 9వ షెడ్యూల్ లో చేర్చాల్సింది కేంద్ర ప్రభుత్వమే అన్నారు. 9వ షెడ్యూల్ లో చేర్చాలని మేం జంతర్ మంతర్ దగ్గర ఇప్పటికే ధర్నా చేశామని కూడా గుర్తుచేశారు. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాంమని ఇప్పుడు బిసి రిజర్వేషన్ల కు వ్యతిరేకంగా పనిచేస్తే మేం సహించం అని ఆది హెచ్చరించారు. రామచంద్రరావు కూడా ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు నడ్డా (Nadda) ను రిజర్వే షన్లపై నిలదీయాలని ఆదిశ్రీనివాస్ హితవు చెప్పారు. సొంత పార్టీని ఒప్పించుకోవడం చేతకాక మా పైన విమర్శలు చేస్తే సరిపోదని అన్నారు. తెలంగాణలోని వెనుకబడిన తరగతుల ప్రజలు బిజెపి దొంగ నాటకాన్ని గమనించాలని కోరారు. ఈటెల రాజేందర్, ధర్మపురి అర్వింద్ తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చడానికి నోరువిప్పాలని ఎందుకు బిజెపి బిసి నేతలు నోరు మెదపడంలేదని ఆయన ప్రశ్నించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Sabari Express: శబరి ఎక్స్ ప్రెస్ సూపర్ ఫాస్ట్ గా అప్గ్రేడ్