సౌత్ కొరియాలో జరిగిన విమాన ప్రమాదం తీవ్రమైన విషాదాన్ని మిగిల్చింది. సౌత్ కొరియా ఆగ్నిమాపక శాఖ 181 మందితో ఉన్న విమానంలో 179 మంది మృతి చెందారు. కేవలం ఇద్దరు ప్రయాణికులు మాత్రమే బతికిపోయారు. వీరిలో 33 సంవత్సరాల వయస్సున్న అటెండెంట్ లీ మరియు 20 ఏళ్ల మహిళ ఉంటారని అధికారులు వెల్లడించారు. విమానం Muan విమానాశ్రయంలో ల్యాండింగ్ గేర్ సమస్య కారణంగా గోడను ఢీకొట్టి పేలిపోయింది. ఇక ల్యాండింగ్ గేర్ విఫలం కావడంతోనే ఈ విమానం అదుపు తప్పి రన్ వేపై దూసుకువెళ్లి ప్రమాదానికి గురైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు.. తదుపరి చర్యలు చేపడుతున్నారు.
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి దక్షిణ కొరియాకుని బయల్దేరిన “ది జేజు” ఎయిర్ ఫ్లైట్‌కు చెందిన 7C2216 నంబర్ బోయింగ్ 737-800 విమానం.. ముయాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యే సమయంలో అదుపు తప్పింది. దీంతో రన్ వేపై అతివేగంగా దూసుకెళ్లి ఎయిర్‌పోర్టు రక్షణ గోడను ఢీకొట్టడంతో పేలుడు సంభవించింది. ఇక విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించగా.. ల్యాండింగ్ గేర్ పనిచేయలేదని.. ఈ సమస్య కారణంగానే విమానం ప్రమాదానికి గురైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు.