हिन्दी | Epaper

వైద్యపరీక్షల కోసం అల్లు అర్జున్ ని గాంధీకి తరలింపు

Vanipushpa
వైద్యపరీక్షల కోసం అల్లు అర్జున్ ని గాంధీకి తరలింపు

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. పీఎస్ లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. పోలీసులు ప్రస్తుతం రిమాండ్ రిపోర్టును తయారు చేస్తున్నారు. ఇటీవల జరిగిన సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఓ మహిళ మరణించడం, మరో బాబు గాయపడి చికిత్స తీసుకోవడం తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ ను ఈ రోజు అరెస్టు చేసారు.

మరోవైపు వైద్య పరీక్షల కోసం బన్నీని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బన్నీపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదయింది. ఆయన న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఇంకోవైపు, చిక్కడపల్లి పీఎస్ కు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, సోదరుడు శిరీష్ చేరుకున్నారు. ఈ ఉదయం నుంచి బన్నీ అభిమానులు తీవ్ర ఆవేదనలో వున్నారు. తమ అభిమాన నటుడు అరెస్టు ను జీర్ణించుకోలేక పోతున్నారు. అల్లు త్వరలోనే ఈ కేసు నుంచి బయట పడాలని కోరుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మోనాలిసా!

పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మోనాలిసా!

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

‘ధురంధర్ 2’ టికెట్లకు డిమాండ్, ధర రూ.2400 దాటింది

‘ధురంధర్ 2’ టికెట్లకు డిమాండ్, ధర రూ.2400 దాటింది

మెగా కుటుంబానికి వెన్నుముక ‘సురేఖ కొణిదెల’

మెగా కుటుంబానికి వెన్నుముక ‘సురేఖ కొణిదెల’

అప్పుడే లాభాల బాటలో ఉస్తాద్ భగత్ సింగ్

అప్పుడే లాభాల బాటలో ఉస్తాద్ భగత్ సింగ్

కంటెంట్ కు పెద్ద పీఠం వేసిన గద్దర్ అవార్డ్స్

కంటెంట్ కు పెద్ద పీఠం వేసిన గద్దర్ అవార్డ్స్

జయకృష్ణ ఘట్టమనేని తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం మూడో దశ ముగింపు

జయకృష్ణ ఘట్టమనేని తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం మూడో దశ ముగింపు

శర్వానంద్ భోగి చిత్రంలో గంగగా మాస్ అవతారం ఫస్ట్ లుక్

శర్వానంద్ భోగి చిత్రంలో గంగగా మాస్ అవతారం ఫస్ట్ లుక్

కియారా బికినీ లుక్ పై మరోసారి వర్మ కీలక వ్యాఖ్యలు

కియారా బికినీ లుక్ పై మరోసారి వర్మ కీలక వ్యాఖ్యలు

📢 For Advertisement Booking: 98481 12870