కన్నడ సినీ పరిశ్రమలో పెద్ద కలకలం రేపిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ప్రముఖ నటుడు దర్శన్‌కి మధ్యంతర బెయిల్ మంజూరైంది. వెన్నెముకకు శస్త్రచికిత్స అవసరమని చెబుతూ ఆయన న్యాయస్థానాన్ని అనుమతి కోరగా, కోర్టు ఆర్డర్ మేరకు 6 వారాల మధ్యంతర బెయిల్‌ను ఇచ్చింది. అయితే, ఈ మధ్యంతర బెయిల్ కాలం పూర్తయ్యేలోపే, రెగ్యులర్ బెయిల్ కోసం కూడా దర్శన్ దరఖాస్తు చేశారు.
గతంలో జూన్ 11న రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ కావడం కన్నడ సినీ అభిమానులను, ప్రేక్షకులను తీవ్ర షాక్‌కి గురిచేసింది. ఈ కేసులో ప్రస్తుతం విచారణ కొనసాగుతుండగా, దర్శన్‌కు త్వరలో బెయిల్‌పై తదుపరి విచారణ జరగనుంది. దర్శన్‌కి మధ్యంతర బెయిల్ ఇవ్వడం ద్వారా వెన్నెముక సర్జరీకి తగిన సమయం దొరకినప్పటికీ, ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. రేణుకాస్వామి హత్య కేసు వల్ల దర్శన్‌కు ప్రత్యక్షంగా సంబంధం ఉందా అనే అంశంపై న్యాయస్థానం లోతైన విచారణ చేపట్టాల్సి ఉంది. మరోవైపు, ఈ కేసులోని మరిన్ని ఆధారాలు వెలుగులోకి వస్తే దర్శన్‌కు ఉన్న ఆరోపణలు ఎంతవరకు వాస్తవమో అన్నది స్పష్టమవుతుందని భావిస్తున్నారు.