हिन्दी | Epaper
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Telugu News: Breaking News-సిక్కింలో కొండచరియలు విరిగి నలుగురు మృతి

Pooja
Telugu News: Breaking News-సిక్కింలో కొండచరియలు విరిగి నలుగురు మృతి

Breaking News-దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. పంజాబ్ లో కనివిని ఎరుగనంతగా ఆకస్మిక వర్షాలు, వరదలతో రాష్ట్రం మొత్తం స్తంభించిపోయింది. లక్షల్లో పంటలు నీటమునిగాయి. వందల్లో ప్రజలు మరణించారు, లక్షలాదిమంది తమ ఇళ్లను కోల్పోయి, నిరాశ్రయులయ్యారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ లలో క్లౌడ్ బరస్ట్(Cloud Burst) తో గ్రామాలు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. గతంలో సిక్కింలో వరదలు, కొండచరియలు విరిగిపడడంతో అనేకులు మరణించారు. తాజాగా సిక్కింలోని యాంగ్ తాంగ్లోని ఎగువ రింబిలో గురువారం రాత్రి భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఊహించని ప్రమాదం కారణంగా వరద నీరు ఉప్పొంగింది. దిగువన ఉండే ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒకవైపు వరదనీరు మరోవైపు కొండచరియలు విరిగి ఇళ్లలపై పడటంతో నలుగురు మరణించారు. మరో ముగ్గురు గల్లంతు అయ్యారు.

Breaking News

కొనసాగుతున్న గాలింపు చర్యలు

గల్లంతు అయినవారి కోసం గ్రామస్తులు, (SSB staff) గాలింపు చేపట్టారు. పొంగిపొర్లుతున్న హ్యూమ్ నదిపై పోలీసులు, స్థానిక ప్రజలు చెక్క దుంగలతో తాత్కాలిక బ్రిడ్జ్ నిర్మించారు. దీంతో ఇద్దరు మహిళలను రక్షించగల్గారు. భారీ వర్షాల కారణంగా పర్వతాలు పగుళ్లు ఏర్పడి, భారీ కొండచరియలు విరిగిపడ్డాయని ఎస్పీ గెజింగ్ షెరింగ్ షెర్పా తెలిపారు. హ్యూమ్ నది ఉప్పొంగి ప్రవహించి, నీరు ఇళ్లలోకి రావడంతో పలువురు గాయపడ్డారు. వీరిలో ఒక మహిళ మరణించగా,మరొక మహిళ పరిస్థితి విషమంగా మారింది. మరో ముగ్గురు గల్లంతు అయినట్లు అధికారులు తెలిపారు.

మరో వారంరోజులు ఇదే వాతావరణ పరిస్థితి

కాగా సిక్కింలో మరో వారం రోజుల పాటు ఇదే వాతావరణపరిస్థితి ఉంటుందని అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ సహా పరిసర ప్రాంతాలలో తుపాను వచ్చే ప్రమాదం ఉన్నట్లు చెబుతున్నారు. సెప్టెంబరు 12 నుంచి 17మధ్య అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

సిక్కింలో ఎక్కడ ఈ ప్రమాదం జరిగింది?
భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిన ప్రాంతాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో ఎన్ని మంది మృతి చెందారు?
మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Telugu News: Anushka-సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన అనుష్క

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870