ktr comments on congress government

రాజకీయాలకు బ్రేక్.. కేటీఆర్ సంచలన ట్వీట్

హైదరాబాద్‌: రాజకీయాల నుంచి కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ నిర్ణయించారు. ఎన్నికలు మొదలుకొని తీరిక లేకుండా రాజకీయాల్లో బిజీగా ఉన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొన్నిరోజుల పాటు రాజకీయాల నుంచి బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నానని.. దీని కారణంగా ప్రత్యర్థులు మిస్ అవ్వరు కదా అంటూ పోస్టు చేశారు. అయతే ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్స్ పలురకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

కేటీఆర్‌ గతేడాది అసెంబ్లీ ఎన్నికల నుంచి నేటి వరకు కొద్ది రోజులు మినహా పూర్తి స్థాయిలో రాజకీయాల్లోనే ఉన్నారు. అందుకే కొన్ని రోజుల పాటు పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని చూస్తున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన దీక్షా దివస్ విజయవంతం కావడంతో శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా పార్టీ శ్రేణులు తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాయని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇకపై రెగ్యులర్‌గా ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాగా, కేటీఆర్ విశ్రాంతి తీసుకొని మరింత ఉత్సాహంగా పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు రావాలని భావిస్తున్నారు. శ్రేణులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. విశ్రాంతి సమయంలో ప్రత్యర్థుల విమర్శలకు తాము సమాధానం ఇస్తామంటూ ట్విట్టర్‌లో ఆయన పోస్టుకు కామెంట్స్ పెడుతున్నారు. అయితే రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ అందుబాటులో ఉంటారని తెలుస్తోంది.

ఇకపోతే..శుక్రవారం జరిగిన దీక్షా దివస్‌లో మాట్లాడిన కేటీఆర్… కాంగ్రెస్‌ ఏడాది పాలనలోనే తెలంగాణలో పూడ్చలేని నష్టం వాటిల్లిందన్నారు. గుజరాత్‌ గులాములు, ఢిల్లీ కీలుబొమ్మలతో తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. అవసరమైతే ప్రజల కోసం మరోసారి దీక్ష చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవతం చేసిన వారందరికీ ఆయన అభినందలు తెలియజేశారు.

Related Posts
తెలంగాణ హైకోర్టులో గుండెపోటుతో- న్యాయవాది మృతి
Lawyer dies of heart attack in Telangana High Court

ఓ కేసులో వాదనలు వినిపిస్తుండగా కుప్పకూలిన న్యాయవాది వేణుగోపాల్ హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టులో విషాద ఘటన చోటు చేసుకుంది. కోర్టు హాలులో న్యాయవాది కుప్పకూలిన ఘటన తోటి Read more

కాంగ్రెస్‌ మరోసారి నవ్వులపాలైంది – కిషన్ రెడ్డి
kishan reddy warning

మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయి..మరోసారి నవ్వులపాలైందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి 251 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ ను Read more

అందరికి రుణమాఫీ చేసి తీరుతాం – పొంగులేటి
runamafi ponguleti

అర్హులైన రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత ప్రభుత్వం గడిచిన పదేళ్లలో రూ.13,500 కోట్లు రెండు విడతలుగా మాఫీ Read more

యుఎస్ఏలో భారతీయ విద్యార్థుల కోసం వేసవి పాఠశాలను ప్రారంభించేందుకు రిసాయా అకాడమీతో నార్తర్న్ అరిజోనా యూనివర్సిటీ భాగస్వామ్యం
Northern Arizona University partners with Risaya Academy to launch summer school for Indian students in USA

• ఈ భాగస్వామ్యం ద్వారా తమ విద్యార్థులకు ప్రపంచ అనుభవాన్ని మెరుగుపరుస్తోన్న మల్లా రెడ్డి యూనివర్సిటీ , హైదరాబాద్..• కంప్యూటర్ ఇంజనీరింగ్ మరియు ఇమ్మెర్సివ్ మీడియాలో గ్లోబల్ Read more