తెలంగాణలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తులకు బ్రేక్!

తెలంగాణలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తులకు బ్రేక్!

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియను భారత ఎన్నికల కమిషన్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఇటీవల, రాష్ట్ర ప్రభుత్వం మీసేవా కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. అయితే, శుక్రవారం జరిగిన తాజా పరిణామంలో, ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisements

రాబోయే శాసన మండలి సభ్యుల (MLC) ఎన్నికల నేపథ్యంలో, మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. దీని ప్రభావంతో, కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు మాత్రమే కాకుండా, మార్పులు మరియు చేర్పుల కోసం సమర్పించే అభ్యర్థనలను కూడా వెంటనే నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.

అయితే గ్రామసభల సమయంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోని మీసేవా కేంద్రాల ద్వారా తమ దరఖాస్తులను సమర్పించుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అంతేకాక, ఇప్పటికే రేషన్ కార్డు కలిగిన వారు అవసరమైన మార్పులు, చేర్పులను కూడా మీసేవా ద్వారా చేయించుకోవచ్చని వివరించింది. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి అధికారిక ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. కానీ MLC ఎన్నికల వాళ్ళ తినికి బ్రేక్ పడింది.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ తాత్కాలికంగా నిలిపివేయబడింది. ఇది ఎప్పటి వరకు అమలులో ఉంటుందనే అంశంపై అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది. ప్రజలు ఎలాంటి సందేహాలున్నా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Related Posts
తెలంగాణ SLBC టన్నెల్ రెస్క్యూ డే 6 LIVE అప్డేట్స్8 మంది చిక్కుకున్న 125 గంటలు గడిచిన తర్వాత కూడా ?
తెలంగాణ SLBC టన్నెల్ రెస్క్యూ డే 6 LIVE అప్డేట్స్

8 మంది చిక్కుకున్న 125 గంటలు గడిచిన తర్వాత కూడా వారు తినేందుకు ఆహారం లేదా తాగేందుకు నీరు పొందలేకపోయారు. వారిద్దరి బతికే అవకాశాలు తగ్గిపోతున్నాయి. NAGARKURNOOL Read more

KTR vs Surekha : పరువు నష్టం కేసు విచారణ వాయిదా
KTRs defamation suit against Konda Surekha. Hearing in court today

మంత్రి కొండా సురేఖపై పెట్టిన పరువునష్టం దావాపై కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణను నవంబర్ 13కు వాయిదా వేయడం జరిగింది. నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ సెలవులో Read more

రేపు సెలవు – తెలంగాణ ప్రభుత్వం ప్రకటన
Holiday tomorrow - Announcement by Telangana Govt

తెలంగాణ ప్రభుత్వం జనవరి 1న నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పబ్లిక్ హాలిడే ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు మరియు బ్యాంకులు Read more

ఏప్రిల్ 1 నుంచే ఇంటర్ క్లాసులు.. సెలవులు కుదింపు
Inter classes from April 1. Holidays will be shortened

అమరావతి: ఏపీ ఇంటర్ విద్యలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌లో ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను, సీబీ ఎస్‌ఈ విధానాలను Read more

×