Bomb threats to Delhi schools again

మళ్లీ ఢిల్లీ పాఠశాలలకు బాంబు బెదిరింపులు

న్యూఢిల్లీ: మరోసారి దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. శుక్రవారం దాదాపు 30 పాఠశాలలకు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం ఉదయం కూడా పలు స్కూళ్లకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఆర్కేపురం, వసంత్‌ కుంజ్‌ ప్రాంతాల్లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్ సహా పలు పాఠశాలలు బెదిరింపులు వచ్చాయి. శనివారం ఉదయం 6:12 గంటల ప్రాంతంలో బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఆయా పాఠశాలల యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు పాఠశాలల వద్దకు చేరుకొని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో పాఠశాలల ఆవరణల్లో తనిఖీలు చేశారు. అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ లభించలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, సూళ్లలో బాంబులు ఉన్నాయంటూ బెదిరింపులు రావడంతో ఈ వారంలో ఇది మూడోసారి కావడం గమనార్హం. వరుస బెదిరింపులతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

కాగా, (డిసెంబరు 9న) కూడా 40కి పైగా స్కూళ్లకు ఈ తరహా బెదిరింపులే వచ్చాయి. పాఠశాల ఆవరణల్లో పేలుడు పదార్థాలను అమర్చామని, వాటిని పేల్చకుండా ఉండాలంటే 30వేల డాలర్లు ఇవ్వాలని గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించారు. అయితే, అది నకిలీదని ఆ తర్వాతి ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 2024 ఆరంభం నుంచి దిల్లీ, ఇతర ప్రాంతాల్లో పాఠశాలలకు పలుమార్లు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇక, అక్టోబరులో దిల్లీలోని రోహిణి ప్రాంతంలోని ఓ సీఆర్​పీఎఫ్‌ స్కూల్‌ బయట బాంబు పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది.

Related Posts
కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.నేడు బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం రేవంత్ Read more

నేడు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటన
CM Revanth Reddy visit to Karimnagar and Nizamabad districts today

కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ తరఫున విస్తృత ప్రచారం హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల Read more

వైజాగ్, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
vizag metro

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్ మరియు విజయవాడ మెట్రో ప్రాజెక్టుల కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెట్రో నిర్మాణం ద్వారా నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గించడంతో పాటు, ప్రజలకు Read more

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రికెట్ అకాడమీ స్థాపించబడుతుంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రికెట్ అకాడమీ స్థాపించబడుతుంది

ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ACA) అమరావతిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నది. ఈ ప్రాజెక్టు అమలు అయితే, క్రికెట్ ప్రేమికులకు మరింత అభిరుచిని Read more