Bomb threats.Bomb squad checks at CRPF school in Secunderabad

బాంబు బెదిరింపులు..సికింద్రాబాద్‌లోని సీఆర్పీఎఫ్‌ పాఠశాల వద్ద బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు

హైదరాబాద్‌: ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశంలోని అన్ని సీఆర్పీఎఫ్ స్కూళ్లకు సోమవారం అర్ధరాత్రి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో సికింద్రాబాద్ జవహర్‌ నగర్‌ పరిధిలోని సీఆర్పీఎఫ్‌ పాఠశాల వద్ద బాంబ్‌ స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న సీఆర్పీఎఫ్‌ పాఠశాలలకు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు కాల్ రావడంతో నగరంలోని పోలీసులు అప్రమత్తమయ్యారు.

పాఠశాలకు చేరుకున్న జవహర్ నగర్ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పాఠశాలలోని పిల్లలను క్షేమంగా వారి వారి ఇళ్లకు స్కూల్‌ యాజమాన్యం పంపించింది. ఘటనా స్థలికి రాచకొండ సీపీ సుధీర్ బాబు, కుషాయిగూడ ఏసీబీ మహేశ్‌ చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

కాగా, ఆదివారం దేశరాజధానిలోని రోహిణిలో పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన మరుసటిరోజే దేశవ్యాప్తంగా అన్ని సీఆర్పీఎఫ్ స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు, యాజమాన్యం అప్రమత్తమైంది.

Related Posts
కోహ్లీ, రోహిత్ ప్రదర్శనపై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు
కోహ్లీ, రోహిత్ ప్రదర్శనపై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మపై క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ మరియు రోహిత్ గతంలో అనేక Read more

సిరియాలో కొనసాగుతున్న మారణకాండ
సిరియాలో కొనసాగుతున్న మారణకాండ

సిరియాలో ప్రభుత్వ అనుకూల దళాలు తమ ప్రత్యర్థులను ఊచకోత కోస్తున్నాయి. దేశంలో ఐదు రోజులుగా సాగుతున్న అంతర్యుద్ధంలో వందల సంఖ్యలో సాయుధులు మృత్యువాత పడుతున్నారు. గత ఏడాది Read more

చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
CBN CYR

చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, జీడి నెల్లూరు ప్రాంతంలో లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి, Read more

జాకీర్ హుస్సేన్ మృతి పట్ల చంద్రబాబు, లోకేశ్ ల సంతాపం
zakir hussain

ప్రముఖ తబలా విద్వాంసులు జాకీర్ హుస్సేన్ మృతి చెందడంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సంతాపం వ్యక్తం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *