హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. గురువారం ఉదయం ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. సైబరాబాద్ కంట్రోల్‌రూమ్‌కు ఓ ఆగంతకుడుకు ఫోన్ చేసి బెదరించాడు. దీంతో అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ.. ముమ్మర తనిఖీలు చేశారు.

అయితే, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని ఎయిర్ పోర్ట్ అధికారులు తేల్చారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి తెలంగాణలోని కామారెడ్డి వాసిగా గుర్తించిన అధికారులు.. అతడికి మతిస్థిమితం లేదని నిర్దారించారు. ఇటీవల కూడా శంషాబాద్ ఎయిర్ పోర్టుతోపాటు దేశవ్యాప్తంగా పలు విమానాలకు బాంబు బెదిరింపలు వచ్చిన సంగతి తెలిసిందే.