Bomb threat to Air India flight. Emergency landing

ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

న్యూఢిల్లీ: ముంబయి నుంచి న్యూయార్క్‌ వెళ్తున్న ఎయిర్‌ విమానం ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. విమానంలో బాంబు పెట్టినట్లు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పైలట్‌ విమానాన్ని ఢిల్లీకి దారిమళ్లించారు. సోమవారం ఉదయం ఎయిర్‌ ఇండియాకు చెందిన ఏఐ119 విమానం ముంబై నుంచి న్యూయార్క్‌కు వెళ్తున్నది. ఈ క్రమంలో విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపులు రావడంతో సిబ్బంది ఏటీసీకి సమాచారం అందించారు. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. అనంతరం ప్రయాణికులను అంతా దించివేసి.. ఐసోలేషన్‌ రన్‌వేకు తరలించారు. ప్రస్తుతం ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.

ఇదే విషయపై ఎయిర్‌ ఇండియా సంస్థ స్పదించింది. ప్రభుత్వ నిబంధనల మేరకు విమానాన్ని ఢిల్లీకి మళ్లించామని సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారని తెలిపారు.

Related Posts
అయోధ్య ఆలయ ప్రధానపూజారి కన్నుమూత
Chief priests of Ayodhya temple passed away

అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ కన్నుమూశారు సత్యేంద్ర దాస్ కు చిన్నప్పటి నుంచి రామ్ పై అపారమైన ప్రేమ. అయోధ్య రామాలయ ప్రధాన Read more

రెండు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉపఎన్నికల పోలింగ్‌..
By election polling in Milkipur and Erode (East) constituencies in Tamil Nadu

న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాల్లో ఉపఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. 247 పోలింగ్‌ బూత్‌లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని మిల్కిపూర్‌‌, Read more

అమెరికా ఐరోపా నుంచి కూడా రన్యారావు బంగారం స్మగ్లింగ్
అమెరికా ఐరోపా నుంచి కూడా రన్యారావు బంగారం స్మగ్లింగ్

దుబాయ్ నుంచి అక్రమ బంగారం స్మగ్లింగ్ కేసు: కన్నడ నటి రన్యా రావు అరెస్టు ప్రముఖ కన్నడ నటి రన్యా రావు అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. Read more

రాహుల్ గాంధీ పై శివసేన ధ్వజం
రాహుల్ గాంధీ పై శివసేన ధ్వజం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముంబై పర్యటనపై శివసేన నాయకుడు సంజయ్ నిరుపమ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకుడిలా కాకుండా ఒక యూట్యూబర్‌లాగా Read more