మంగళవారం ఉదయం హైదరాబాద్ (Hyderabad) నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నాలుగు కీలక ప్రదేశాల్లో బాంబులు పెట్టామంటూ వచ్చిన బెదిరింపు మెయిల్స్‌తో అధికారులు హై అలర్ట్‌కు చేరుకున్నారు.‘అబీదా అబ్దుల్లా’ అనే పేరుతో ఓ గుర్తు తెలియని వ్యక్తి, నగరంలోని సిటీ సివిల్ కోర్టు, జడ్జి ఛాంబర్స్, జింఖానా క్లబ్, రాజ్‌భవన్‌లలో బాంబులు అమర్చామంటూ మెయిల్ (Mail claiming to have planted bombs) పంపాడు. ఐఈడీ, ఆర్‌డీఎక్స్ వంటి శక్తివంతమైన పేలుడు పదార్థాలు వినియోగించామన్న హెచ్చరికతో అధికారులకు హడలెత్తుకొచ్చింది.బెదిరింపు మెయిల్ వచ్చిన వెంటనే పోలీసులు అలెర్ట్ అయ్యారు. కోర్టు పరిసరాల్లోని న్యాయవాదులు, సిబ్బంది, ప్రజలను సురక్షితంగా బయటకు తరలించారు. కోర్టు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేశారు.

బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ల గాలింపు
ఘటనాస్థలాలకు బాంబ్ డిస్పోజల్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు చేరుకున్నాయి. మూడు గంటల పాటు విస్తృతంగా తనిఖీలు చేశారు. అన్ని ప్రాంతాల్లోని కోణాలను పరిశీలించినా ఎటువంటి బాంబులు, పేలుడు పదార్థాలు లభించలేదు.
భద్రతా చర్యలతో ఊపిరి పీల్చుకున్న నగర ప్రజలు
తదుపరి ప్రమాదం ఏమీ లేని విషయం తేలడంతో అధికారులు, కోర్టు సిబ్బంది, నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది కేవలం బూటకపు బెదిరింపు అని పోలీసులు స్పష్టం చేశారు.
పోలీసుల దర్యాప్తు ముమ్మరం – మెయిల్ మూలాల జాడలో
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెదిరింపు పంపినవారి గుర్తింపు కోసం సాంకేతిక ఆధారాలపై దృష్టి సారించారు. మెయిల్ వచ్చిన ఐపీ అడ్రెస్, ఇతర డిజిటల్ ట్రేసుల ఆధారంగా నిందితుల జాడ కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.
Read Also : YSR Jayanti : ఈరోజు వైయస్సార్ జయంతి