prakash raj bolishetty 1

హిందూ మతం అంటే ప్రతీవాడికీ లోకువైపోయింది – బొలిశెట్టి

కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ అని ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ కు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. తిరుమల లడ్డు విషయంలో ప్రకాష్ రాజ్..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. వరుస ట్వీట్స్ చేస్తూ అభిమానుల్లో ఆగ్రహం పెంచుతూ వస్తున్నారు. ఈ తరుణంలో సుప్రీం కోర్ట్ ఈ లడ్డు వ్యవహారం లో ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేయడం తో కూటమి శ్రేణులు సుప్రీం వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా..వైసీపీ మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ తరుణంలో ప్రకాష్ రాజ్ ..పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి.. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ, కదా? ఇక చాలు ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి. అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ పవన్‌ కళ్యాణ్ గురించే అని, దీక్షలు చేయడం మానేసి పరిపాలన పై దృష్టి పెట్టాలి అంటూ ప్రకాష్ రాజ్ పరోక్షంగా పవన్‌ కళ్యాణ్‌పైప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్కు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ కౌంటరిచ్చారు. ‘భక్తుడి గురించి మాట్లాడే ధైర్యం చేసిన మీరు కోర్టు విచారణ నుంచి తప్పించుకు తిరుగుతున్న నేరారోపితుడు జగన్కి కోర్టుకు హాజరవాలని చెప్పే సాహసం ఎందుకు చేయలేదు. గొడ్డలికి భయపడా? హిందూ మతం అంటే ప్రతీవాడికీ లోకువైపోయింది. మత అపచారాలకు సాక్ష్యాలుండవు. ఆ విషయాలు కోర్టులో తేలవు’అని ట్వీట్ చేశారు.

Related Posts
స్పేస్‌ఎక్స్ ఆరవ స్టార్షిప్ పరీక్షా ప్రయోగం
space x

స్పేస్‌ఎక్స్ తన స్టార్‌షిప్ లాంచ్ వాహనానికి సంబంధించిన ఆరవ పరీక్షా ప్రయోగం ఈ రోజు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇది అక్టోబర్ 13, 2024 న జరిగిన 5వ Read more

గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కొరకు డీమ్డ్ యూనివర్శిటీ అప్లికేషన్స్
Deemed University inviting applications for undergraduate programmes

న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద ప్రైవేట్ యూనివర్శిటీగా పేరుతెచ్చుకున్న సింబయాసిస్ ఇంటర్నేషనల్ ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కొరకు అప్లికేషన్స్ ను ఆహ్వానిస్తోంది. సింబయాసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్ Read more

మహా కుంభమేళా విజయవంతం – మోదీ ప్రశంసలు
మహా కుంభమేళా విజయవంతం - మోదీ ప్రశంసలు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మహాసభ అయిన ప్రయాగ్‌రాజ్ మహా కుంభ మేళా వైభవంగా ముగిసింది. 45 రోజులపాటు జరిగిన ఈ విశ్వవిఖ్యాత మహోత్సవంలో 66 కోట్ల మందికి Read more

Congress Govt : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!
Another key decision by the Telangana government.

Congress Govt: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ట్యాంక్‌బండ్ పీపుల్స్ ప్లాజాలో నెల‌కొల్పిన నీరా కేఫ్‌ ను క‌ల్లుగీత పారిశ్రామిక కార్పొరేష‌న్‌ కు Read more