prakash raj bolishetty 1

హిందూ మతం అంటే ప్రతీవాడికీ లోకువైపోయింది – బొలిశెట్టి

కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ అని ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ కు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. తిరుమల లడ్డు విషయంలో ప్రకాష్ రాజ్..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. వరుస ట్వీట్స్ చేస్తూ అభిమానుల్లో ఆగ్రహం పెంచుతూ వస్తున్నారు. ఈ తరుణంలో సుప్రీం కోర్ట్ ఈ లడ్డు వ్యవహారం లో ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేయడం తో కూటమి శ్రేణులు సుప్రీం వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా..వైసీపీ మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు.

Advertisements

ఈ తరుణంలో ప్రకాష్ రాజ్ ..పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి.. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ, కదా? ఇక చాలు ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి. అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ పవన్‌ కళ్యాణ్ గురించే అని, దీక్షలు చేయడం మానేసి పరిపాలన పై దృష్టి పెట్టాలి అంటూ ప్రకాష్ రాజ్ పరోక్షంగా పవన్‌ కళ్యాణ్‌పైప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్కు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ కౌంటరిచ్చారు. ‘భక్తుడి గురించి మాట్లాడే ధైర్యం చేసిన మీరు కోర్టు విచారణ నుంచి తప్పించుకు తిరుగుతున్న నేరారోపితుడు జగన్కి కోర్టుకు హాజరవాలని చెప్పే సాహసం ఎందుకు చేయలేదు. గొడ్డలికి భయపడా? హిందూ మతం అంటే ప్రతీవాడికీ లోకువైపోయింది. మత అపచారాలకు సాక్ష్యాలుండవు. ఆ విషయాలు కోర్టులో తేలవు’అని ట్వీట్ చేశారు.

Related Posts
వంశీ అరెస్ట్ తో వెలుగులోకి కీలక అంశాలు
వల్లభనేనివంశీ అక్రమార్జన రూ.195 కోట్లు

వైసీపీ నేత మరియు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ వివాదం తాజాగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గన్నవరం టీడీపీ ఆఫీస్‌లో పనిచేస్తున్న సత్యవర్ధన్‌ను బెదిరించి, తప్పుడు Read more

మళ్లీ ఢిల్లీ పాఠశాలలకు బాంబు బెదిరింపులు
Bomb threats to Delhi schools again

న్యూఢిల్లీ: మరోసారి దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. శుక్రవారం దాదాపు 30 పాఠశాలలకు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం ఉదయం Read more

Pawan Kalyan :భాషా వివాదంపై స్పందించిన పవన్‌ కళ్యాణ్‌
Pawan Kalyan :భాషా వివాదంపై స్పందించిన పవన్‌ కళ్యాణ్‌

హిందీ భాషపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడు ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపిస్తున్న Read more

ఏపీలో 15 ప్రాజెక్టులకు ఆమోదం

అమరావతి, జనవరి 30 : రాష్ట్రంలో పెట్టుబడులపై కూటమి ప్రభుత్వ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఆసక్తి Read more