వియత్నాం ప్రముఖ పర్యాటక ప్రాంతం హా లాంగ్ బే వద్ద (Ha Long Bay) విషాదకర ఘటన జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న ఓ పడవ అకస్మాత్తుగా వచ్చిన వాతావరణ మార్పుల కారణంగా సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 34 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 8 మంది గల్లంతయ్యారు.ఈ ప్రమాద సమయంలో పడవలో 48 మంది పర్యాటకులు, 5 మంది సిబ్బంది ఉన్నారు. సమాచారం ప్రకారం, పర్యాటకుల్లో దాదాపు 20 మంది చిన్నారులు ఉన్నట్లు వెల్లడైంది. వారు అందరూ ఆనందంగా పర్యటనకు బయలుదేరారు. అయితే వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.ఆ సమయంలో తుఫాన్ స్థాయిలో గాలులు వీచాయి. గాలుల తీవ్రతకి పడవ పూర్తిగా అదుపుతప్పింది. తీరాన ఉన్నవారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పడవ బోల్తా (The boat capsized) పడటంతో చాలామంది సముద్రంలోకి పడిపోయారు. కొంత మంది ప్రయాణికులు నీటి ప్రవాహానికి పోయారు.

సహాయక చర్యల్లో వేగం
ప్రమాద సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. నాలుగు గంటల పాటు విస్తృతంగా గాలింపు చేపట్టారు. అందులో భాగంగా 11 మందిని సజీవంగా రక్షించగలిగారు. గల్లంతైన వారికోసం గాలింపు ఇంకా కొనసాగుతోంది. పరిస్థితిని తీవ్రంగా తీసుకున్న అధికారులు భారీ స్థాయిలో సహాయ చర్యలు చేపట్టారు.మృతుల్లో చాలా మంది చిన్నారులు ఉండొచ్చని సమాచారం. ఇది స్థానిక అధికారుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వారి కుటుంబాల బాధను మాటల్లో చెప్పలేము. ఘటన జరిగిన వెంటనే స్థానిక మీడియా ఇదే విషయాన్ని హైలైట్ చేసింది.
మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకూడదన్న గమనిక
వాతావరణ హెచ్చరికలను పట్టించుకోకుండా పర్యటనకు అనుమతులు ఇవ్వడం ఇప్పుడు విమర్శలకో కేంద్రమైంది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఈ విషాద ఘటన పర్యాటకులకు గట్టి హెచ్చరికగా నిలుస్తోంది. ప్రకృతి ప్రతిఘటనను తేలికగా తీసుకోవడం ఎంత ప్రమాదకరమో మరోసారి నిరూపితమైంది.
Read Also : Ruturaj Gaikwad: యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ నుంచి వైదొలిగిన రుతురాజ్ గైక్వాడ్