రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్ల (Black Spot) పై ప్రజలను ఆప్రమత్తం చేయడంతోపాటు వాటిని – సరిచేయడానికి ఆర్అండ్, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని కేంద్రప్రభుత్వం హెచ్చరించింది. జాతీయ రహదారులపై అత్యంత ప్రమాదాలు తరుచూ జరిగే ప్రాంతాలను ఆర్అండ్ బి, నేషనల్దావే ఇంజనీర్ల 2. సహాయంతో గుర్తించాలంటూ రాష్ట్ర పోలీసు విభాగానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ లేఖ రాసింది. రోడ్డు 9వ ర్యాంకు ప్రమాదాలకు డ్రైవర్లే కాదు, రోడ్లపై ఉండే పరిస్థితులూ కారణమవుతున్నాయి. రోడ్లు ఇరుగ్గా ఉండటం, జంక్షన్ల వద్ద వాహనాలు అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయడం, వాహనాల పరిమాణానికి, వేగానికి తగ్గట్టు రోడ్లు నిర్మించకపోవడం ముఖ్యంగా మలుపులు, వంపులు ఉండటంతో ప్రమాదాలు తలెత్తుతున్నాయి.. ఇలాంటి ప్రమాదకరమైన ప్రదేశాలను పోలీస్ స్టేషన్ల వారీగా వివరాలు సేకరించే పని ప్రారంభమైంది. దీనిలో భాగంగా హైవేలపై అత్యధిక ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తిస్తారు. ప్రమాదాలకు కారణాలను విశ్లేషిస్తారు.

బ్లాక్ స్పాట్ల (Black Spot) నివారణకు కేంద్రం నిధుల మంజూరు – ప్రమాదాల నియంత్రణకు టెక్నికల్ చర్యలు ప్రారంభం
తెలంగాణలో జాతీయ రహదారులపై 930 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. ఈ వివరాలను కేంద్రానికి పంపుతారు. సిగ్నల్ వ్యవస్థ నెలకొల్పడం, సీసీ కెమెరాల ఏర్పాటు, రోడ్డు వెడల్పు, వాహనాల వేగ నియంత్రణ వంటి చర్యలు చేపట్టనున్నారు. ఆయా ప్రాంతాలకు తగ్గట్టుగా చర్యలు చేపట్టేందుకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది. దేశంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు, మరణాలు జరిగే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ (Telangana) కూడా ఉంది. అత్యధిక ప్రమాదాల్లో 8వ స్థానంలో, మరణాల్లో 9వ స్థానంలో తెలంగాణ ఉంది. పెరుగుతున్న వాహనాలకు అనుగణంగా రహదారుల విస్తరణ లేకపోవడం రద్దీకారణంగా ప్రమాదాలు జరుగుతు న్నాయి. ఒక్క విజయవాడ-హైదరాబాద్ హైవేలోనే ఏకంగా గంటకు వెయ్యికి పైగా వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఈ రద్దీ ప్రతి సంవత్సరానికీ కనీసం ఐదు శాతం చొప్పున పెరిగిపోతోంది. రాష్ట్రంలోని హైవేలు అన్నింటిలోనూ ఇదే పరిస్థితి. పండగలు, ఇతర సెలవుల్లో అయితే సాధారణ ట్రాఫిక్కు కనీసం 10 రెట్లు ఎక్కువ నమోద వుతుంటుంది. ట్రాఫిక్ పెరుగుతున్న కొద్దీ ప్రమాదాల తీవ్రత కూడా పెరుగుతుంటుంది. మన రాష్ట్రంలో గత సంవత్సరం 25,934 ప్రమాదాలు జరిగాయి. వాటిలో 7,281 మంది మరణించారు. రాష్ట్రంలో హైవేలపై జరిగే ప్రమాదాల్లో మరణాల సంఖ్య ఎక్కువ. అందుకే ఈ ప్రమాదాల నివారణపై కేంద్రం దృష్టి సారించింది.
Read also: Ramchandra Rao: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్ రావు