ఆపరేషన్ సిందూర్ (operation sindoor ) విజయవంతమైందని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, ఇందుకు గుర్తుగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశవ్యాప్తంగా “తిరంగయాత్ర” (Tiranga Yatra) నిర్వహిస్తోంది. ఈ యాత్రను నేటి నుంచి ప్రారంభించగా, వచ్చే 11 రోజులు పాటు కొనసాగనుంది. దేశ భద్రత, సైనిక విజయాలు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ప్రజలకు వివరించడం ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని పార్టీ ప్రకటించింది.
జాతీయ జెండాలతో ఊరేగింపులు
ఈ తిరంగయాత్రలో బీజేపీ (BJP) కార్యకర్తలు జాతీయ జెండాలతో ఊరేగింపులు నిర్వహించనున్నారు. పల్లె నుంచి పట్టణాల దాకా యాత్ర కొనసాగుతుంది. ప్రతి ప్రాంతంలో ప్రజలను చైతన్యపరిచేలా కార్యక్రమాలు ఏర్పాటు చేయబడతాయని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా తెలిపారు. యాత్ర ముగింపు రోజున ఓ భారీ సభను నిర్వహించే ఏర్పాటు కూడా జరుగుతోంది.
రాజకీయ ప్రయోజనాల కోసంకాదు
ఈ యాత్రతో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవని, దేశభక్తి, సైనికుల ధైర్యసాహసాలను గౌరవించే ఉద్దేశంతో మాత్రమే దీనిని చేపట్టినట్లు బీజేపీ స్పష్టం చేసింది. అయితే, దేశవ్యాప్తంగా లొక్సభ ఎన్నికల వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో, రాజకీయ పరిశీలకులు దీనిని ప్రజాదరణ పెంచుకునే చర్యగా కూడా చూస్తున్నారు. ఏదేమైనా, ఈ యాత్ర ప్రజల్లో చర్చనీయాంశంగా మారనుంది.
Read Also : India-Pak War : పాక్ కాల్పుల్లో భారత కవలలు మృతి