బిజెపి తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు
తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి దాతలు, భక్తులు ఇచ్చిన భూములు తెలంగాణాలో కూడా ఉన్నాయని, భూములు అన్యాక్రాంతం కాకుండా చూడా లని తెలంగాణ రాష్ట్ర బిజెపి నూతన చీఫ్ (Telangana State BJP’s new chief): రామచంద్రరావు (BJP Ramachandra Rao) తెలిపారు. ఖమ్మంలో కూడా టిటిడి స్థలాలు ఉన్నాయని, అక్కడ అన్యమతస్తులు కొందరు రాజకీయ అండతో వాటిని కబ్జాచేసుకుని గోడను కూలగొట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారని అన్నారు. దేవుని స్థలాలను వాణిజ్యకార్యకలాపాలకు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఆక్రమణలు ఆపాలని, టిటిడి భూములు ఆక్రమణలకు గురికాకుండా కాపాడేందుకు బిజెపి తరపున ప్రయత్నిస్తానని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళతానన్నారు. బిజెపి తెలంగాణ చీప్ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా బుధవారం ఉదయం అనురులతో కలసి తిరుమలకు చేరుకున్న రామచంద్రరావుకు (BJP Ramachandra Rao) టిటిడి బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి (Bhanuprakash Reddy) స్వాగతం పలికి దర్శనం చేయించారు. ఆలయ అదికారుల రంగనాయకులు మండపంలో వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. తెలంగాణ బిజెపి చీప్ గా శ్రీవారి దర్శనం చేసుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Police stations: పాత బస్తీ లో పోలీస్ స్టేషన్ ల ఆధునీకరణ