ఆంధ్రప్రదేశ్‌లో జననాల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS)–2022 నివేదికలో వెల్లడైంది. 2015లో 8.51 లక్షల జననాలు నమోదవగా, 2022 నాటికి ఇవి 7.52 లక్షలకు పడిపోయాయి. ఇది ప్రజల జీవిత విధానంలో మార్పుల్ని సూచిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ఖర్చులు పెరగడం, జీవన పోరాటం, పిల్లల భవిష్యత్తు పై ఆందోళన, ఆలస్య వివాహాలు, వలసలు తదితర అంశాలే ఈ తగ్గుదలకు కారణమని భావిస్తున్నారు.
డబ్బు సంపాదన లో పడి పిల్లలను కనాలనే ఆలోచన లేకపోవడం
వీటితోపాటు, ఉద్యోగం, కెరీర్, జీవన శైలిపై దంపతులు ఎక్కువ దృష్టి పెట్టడమే పిల్లలను కనాలనే నిర్ణయాన్ని ఆలస్యం చేయడానికి దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో జనాభా వృద్ధి రేటు తగ్గుతోంది. చిన్న కుటుంబ వ్యవస్థలు, దంపతులలో భవిష్యత్తుపై ఆందోళనలు కూడా ఈ మార్పుకు బలమైన కారణాలుగా భావించవచ్చు. ప్రభుత్వం ప్రజల్లో ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్థిరత్వం కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లు నిపుణులు సూచిస్తున్నారు.
మరణాల సంఖ్యలో పెరుగుదల
మరోవైపు మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా నిలుస్తోంది. 2018లో 3.75 లక్షల మరణాలు నమోదవగా, 2022 నాటికి ఇవి 4.30 లక్షలకు పెరిగాయి. ఇందులో కరోనా మహమ్మారి ప్రధాన కారణంగా చూపిస్తున్నారు. మహమ్మారి వల్ల భారీగా ప్రాణనష్టం జరిగిందని నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వాలు మెరుగైన ఆరోగ్య సదుపాయాలను అందించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జనన–మరణల ఈ గణాంకాలు ప్రజారోగ్యం, సామాజిక స్థితిగతులపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నిపుణుల అభిప్రాయం.
Read Also : Anakapalle : రసాయన వాయువులు పీల్చి ఇద్దరు మృతి