లాపతా లేడీస్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన రచయిత

Biplab Goswami: లాపతా లేడీస్ సినిమా వివాదంపై క్లారిటీ ఇచ్చిన రచయిత

బాలీవుడ్‌లో ఇటీవల ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రం ‘లాపతా లేడీస్’ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. చిన్న బడ్జెట్‌తో, కానీ బలమైన కంటెంట్‌తో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఈ సినిమా ప్రస్తుతం ఓ అరబిక్ సినిమా ఆధారంగా తీశారనే ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. అయితే ఈ ఆరోపణలపై చిత్ర కథా రచయిత బిప్లబ్ గోస్వామి తాము ఏ సినిమా నుంచి కూడా కాపీ చేయలేదని స్పష్టం చేశారు.

Advertisements

ఒక అరబిక్ సినిమా ‘బుర్ఖా సిటీ’ కథకు ‘లాపతా లేడీస్’ కథకు సామ్యాలున్నాయని కొన్ని మీడియా కథనాలు ప్రచారం చేశాయి. ఇందులోని కథనాన్ని తీసుకుని బాలీవుడ్‌లో దర్శకురాలు కిరణ్ రావ్ తెరకెక్కించారని వార్తలు వచ్చాయి. ఇందులోని మహిళా స్వేచ్ఛ, వివాహ వ్యవస్థపై విమర్శలు, గ్రామీణ భారతంలో సాంఘిక పరిస్థితులు రెండింటిలోనూ వుంటాయని వాటిని పోల్చుతూ చేసిన ఈ ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీశాయి.

బిప్లబ్ గోస్వామి వివరణ

ఈ ఆరోపణలపై బిప్లబ్ గోస్వామి ఓ అధికారిక లేఖ విడుదల చేశారు. నేను లాపతా లేడీస్ కథను 2014లో ‘టూ బ్రైడ్స్’ అనే పేరుతో రాసి, అదే సంవత్సరంలో రిజిస్టర్ చేసుకున్నాను. ఇది పూర్తిగా నా స్వంత సృజన. ఇందులోని పాత్రలు, నేపథ్యాలు, సంభాషణలు అన్నీ ఒరిజినల్. ఏ సినిమా నుంచి కూడా ప్రేరణ పొందలేదు, అని ఆయన తెలిపారు. తాము చేసిన సృజనాత్మక కృషిని ఇలా విమర్శించడం తాము చేసిన శ్రమను నిష్ప్రయోజనంగా మార్చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కిరణ్ రావ్ దర్శకత్వంలో వచ్చిన ‘లాపతా లేడీస్’ సినిమాకు ప్రేక్షకులు మంచి స్పందన ఇచ్చారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాన్ని సమర్పించగా, ఇందులో స్పర్ష్ శ్రీవాస్తవ్, నితాన్షి గోయల్, ప్రతిభ రంతా, రవి కిషన్ వంటి నటులు ముఖ్య పాత్రలు పోషించారు. ముడిపడిన పల్లెటూరి వ్యవస్థ, మహిళల స్వేచ్ఛ, అవమానాలు, అసమానతలపై సినిమా చక్కటి వ్యాఖ్యానం చేస్తుంది. దీనికి గల గ్లోబల్ ఎపీలుతో ఇది ఆస్కార్‌ ఎంట్రీకూ దాఖలైంది. రచయిత బిప్లబ్ గోస్వామి స్పష్టత ఇవ్వడంతో ఇప్పటికి ఈ వివాదం కొంత శాంతించే సూచనలు కనిపిస్తున్నాయి. లాప‌తా లేడిస్‌లోని కథ, పాత్రలు, సంభాషణలు 100 శాతం ఒరిజినల్ అని, కాపీ కొట్టామంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. ఇలాంటి ఆరోపణలు మా శ్రమకు ఫలితం లేకుండా చేస్తాయి. నాకే కాదు, నా టీమ్‌ మొత్తం చేసిన కృషిని దెబ్బ తీస్తాయి అని రచయిత బిప్లాబ్ సోష‌ల్ మీడియాలో చెప్పుకోచ్చాడు.

Read also: Peddi Movie: శ్రీరామనవమి స్పెషల్‌గా ‘పెద్ది’ గ్లింప్స్ వీడియో రిలీజ్

Related Posts
ఆప్-బీజేపీ పోస్టర్ యుద్ధం
ఆప్ బీజేపీ పోస్టర్ యుద్ధం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మరియు ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య శనివారం పోస్టర్ యుద్ధం ఆరంభమైంది. Read more

గేమ్ ఛేంజర్’ నుంచి ‘నానా హైరానా’ సాంగ్
gamechanger song

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ గురించి ఎప్పటినుంచో టాలీవుడ్ ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్నంటాయి. దర్శక Read more

బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం..
Union Cabinet approves budget

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్‌ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు మంత్రిమండలి ఆమోదం Read more

ఏపీలో స్కూల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్
తెలంగాణలో రేపటి నుంచి ఒంటిపూట బడులు – ఏప్రిల్ 1 వరకు అమలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎయిడెడ్‌ పాఠశాలల విద్యార్థులకు శుభవార్త చెప్పింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు 'సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర' కిట్లు అందించనుంది. ఈ కిట్ల Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×