మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates)కి కార్లపై ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. అయితే ఆయన ఓ కారు కోసం ఏకంగా 13 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. అంతేకాదు, ఆ కారును ఉంచుకున్నందుకు ఆయన ప్రతిరోజూ జరిమానా కూడా చెల్లించారు. ఈ విషయం చాలా మందికి తెలియని ఆసక్తికరమైన సంఘటనగా నిలిచింది.1988లో గేట్స్ పోర్షే 959 అనే అరుదైన స్పోర్ట్స్ కారును కొనుగోలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కార్లు కేవలం 337 మాత్రమే ఉన్నాయి. ఆ కాలంలో ఇది అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన ప్రత్యేక వాహనం. అయితే అమెరికా (America) రోడ్ల భద్రతా మరియు కాలుష్య నియమాలకు ఇది సరిపోకపోవడంతో దేశంలోకి దీనిని అనుమతించలేదు.

గోడౌన్‌లో 13 ఏళ్లు కారు నిలిపివేత
నిబంధనల కారణంగా గేట్స్ తన కలల కారును 13 ఏళ్ల పాటు గోడౌన్‌లో ఉంచాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆయన రోజుకు 28 డాలర్లు జరిమానా కట్టారు. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ. 2,400 అవుతుంది. మొత్తం మీద ఆయన చెల్లించిన జరిమానా లక్షా 32 వేల డాలర్లకు పైగా చేరింది.ఈ సమస్యను అధిగమించడానికి గేట్స్ ఒంటరిగా కాకుండా ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్‌తో కలిసి పనిచేశారు. ఇద్దరూ కలిసి అమెరికా కాంగ్రెస్‌ను సంప్రదించారు. వారి కృషి ఫలితంగా 1999లో “షో ఆర్ డిస్‌ప్లే” అనే కొత్త నిబంధన ఆమోదం పొందింది.
కలల కారు నడిపే అవకాశం
ఈ నిబంధన వలన చారిత్రాత్మకంగా లేదా సాంకేతికంగా ముఖ్యమైన వాహనాలను పరిమిత షరతులతో దిగుమతి చేసుకునే అవకాశం కలిగింది. చివరికి 2001లో బిల్ గేట్స్ తన పోర్షే 959 కారును చట్టబద్ధంగా రోడ్డుపై నడిపే అవకాశం పొందారు.గేట్స్ చేసిన ఈ కృషి కేవలం తనకోసం మాత్రమే కాదు. భవిష్యత్తులో అరుదైన కార్లను సేకరించాలనుకునే వ్యక్తులు, విద్యాసంస్థలు, మ్యూజియంలకు కూడా ఈ నిబంధన సౌకర్యాన్ని అందించింది. ఆయన ప్రయత్నం వల్ల అనేక కార్ల సేకరణదారులకు మార్గం సుగమమైంది.
Read Also : Chandrababu Naidu : సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్లో చంద్రబాబు