Bill Gates visits Indian Parliament

Bill Gates : భారత పార్లమెంట్‌ను సందర్శించిన బిల్‌గేట్స్‌

Bill Gates: మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఈరోజు భారత పార్లమెంట్‌ను ఆయన సందర్శించారు. పార్లమెంట్‌ మొత్తం కలియతిరిగారు. అక్కడ బీజేపీ చీఫ్‌, కేంద్ర మంత్రి జేపీ నడ్డా తో చర్చలు జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

భారత పార్లమెంట్‌ను సందర్శించిన బిల్‌గేట్స్‌

గ్రామీణాభివృద్ధి సహా వివిధ సమస్యల పై చర్చ

కాగా, బిల్‌గేట్స్‌ తన పర్యటనలో భాగంగా ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి సహా వివిధ సమస్యలపై చర్చించారు. భారతదేశంలో జరుగుతున్న వ్యవసాయ పరిశోధనలు అద్భుతమైనవి అని బిల్ గేట్స్ చెప్పారు. ఇది ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. గడిచిన మూడేళ్లలో బిల్ గేట్స్ భారత్‌ను మూడు మార్లు సందర్శించడం విశేషం.

బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగింది

మరోవైపు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబు నేడు ఢిల్లీ పార్ల‌మెంట్ కు వ‌చ్చిన బిల్‌గేట్స్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. హెల్త్, ఎడ్యుకేషన్, వ్యవసాయంపై బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. బిల్ గేట్స్‌ను అమరావతి, తిరుపతికి రావాలని సీఎం చంద్రబాబు కోరారు. అందుకు బిల్‌గేట్స్ అంగీకరించారు. ఈ సమావేశం గురించి చంద్రబాబు ట్వీట్ చేశారు. బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగిందని వెల్లడించారు. ఏపీ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ ఏ విధంగా భాగస్వామ్యం కావొచ్చనే అంశంపై ఫలప్రదమైన చర్చ జరిగిందని తెలిపారు.

Related Posts
అద్వానీ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరిక..
lk advani

బీజేపీ నేత మరియు దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకుడైన లాల్ కృష్ణ అద్వానీ (97), శనివారం రాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు Read more

రూ .2.98 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్..
Assembly meeting from today. Cabinet approves AP budget

అమరావతి: ఈరోజు నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జె‌ను ప్రవేశపెట్టనున్నారు. సుమారు రూ. 2.9 లక్షల కోట్లతో Read more

ఏపీలో ఇంటర్ తరగతులు ఎప్పటినుంచంటే?
AP Inter Calss

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు 2025-26 విద్యా సంవత్సరాన్ని ఏప్రిల్ 1న ప్రారంభించేందుకు అకడమిక్ క్యాలెండర్‌ను సిద్ధం చేసింది. ఇందులో విద్యార్థులకు అవసరమైన అన్ని వివరాలను పొందుపరిచారు. కొత్త Read more

Trump: విదేశీ వాహనాలపై 25 శాతం సుంకం.. ట్రంప్‌ వెల్లడి
అమెరికాలో ఆటోమోటివ్ వాహనాలపై భారీగా పన్ను

Trump: విదేశాల్లో తయారై యూఎస్‌లో దిగుమతయ్యే కార్లపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇది ఏప్రిల్‌ 2 నుంచి అమల్లోకి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *