మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆపైన బెయిల్ పైన జానీ మాస్టర్ విడుదల కావడం, తర్వాత జరుగుతున్న పరిణామాలు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ నేపథ్యంలో తాజాగా జానీ మాస్టర్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. జానీ మాస్టర్ మీద తీసుకున్న నిర్ణయం పైన ఆయన వేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. యాంకర్ ఝాన్సీ పోస్ట్ ఈ విషయాన్ని యాంకర్, ఫిలిం ఇండస్ట్రీ అసోసియేషన్ కమిటీ సభ్యురాలు ఝాన్సీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫిల్మ్ చాంబర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ వేసిన మధ్యంతర పిటిషన్ ను జిల్లా కోర్టు కొట్టి వేసిందని యాంకర్ ఝాన్సీ తన పోస్టులో పేర్కొన్నారు.
![jhansi jani master](https://vaartha.com/wp-content/uploads/2025/01/jhansi-jani-master-95-1738142172.jpg.webp)
జానీ మాస్టర్ పిటీషన్ పై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది: యాంకర్ ఝాన్సీ మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా కోర్టు ఇచ్చిన తీర్పు కీలకమైన తీర్పు అని ఝాన్సీ వెల్లడించారు. కోర్టు మరోసారి మహిళల భద్రతకు ప్రాధాన్యతను ఇస్తుందని స్పష్టతనిచ్చిందని ఆమె తెలిపారు. పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు భద్రత ప్రధానమని POSH మార్గదర్శకాలను అమలు చేసే సంస్థలకు ఎప్పుడు మద్దతు ఉంటుందనేది ఈ తీర్పుతో రుజువైందని యాంకర్ ఝాన్సీ వెల్లడించారు.. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన శ్రేష్ఠి వర్మ ఫిలిం ఛాంబర్ లోని లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ లోను జానీ మాస్టర్ లైంగిక వేధింపుల పైన ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కమిటీ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫిలిం ఛాంబర్ ని కోరింది. అయితే ఈ కేసులో తన నేరం రుజువు కాకుండా తనను ఎలా తప్పిస్తారని జానీ మాస్టర్ కోర్టును ఆశ్రయించారు.