Big shock for Ramgopal Varma

రాంగోపాల్‌ వర్మకు బిగ్‌ షాక్‌..

హైదరాబాద్‌: వివాదాస్పద దర్శకుడిగా పేరుపొందిన రాంగోపాల్‌ వర్మ కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఓ కేసుకు సంబంధించి మూడు నెలలు జైలు శిక్ష విధిస్తూ ముంబై కోర్టు సంచలన తీర్పునిచ్చింది. చెక్ బౌన్స్ కు సంబంధించి ఆరేళ్ల కిందటి కేసులో విచారణ సందర్భంగా ముంబైలోని అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. మూడు నెలల్లో ఫిర్యాదుదారుడికి రూ.3,72,219 పరిహారం చెల్లించాలని వర్మను కోర్టు ఆదేశించింది. పరిహారం చెల్లించని పక్షంలో మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.

Advertisements
image

2018లో రామ్ గోపాల్ వర్మపై ఈ చెక్ బౌన్స్ కేసు నమోదైంది. మహేశ్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో రాంగోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఈ కేసులో అప్పటి నుంచి వర్మ ఒక్కసారి కూడా కోర్టుకు హాజరుకాలేదు. ఈ క్రమంలో తాజాగా కోర్టు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

Related Posts
నటి సోనాలి బింద్రేతో ప్రేమాయణం పై మౌనం
Sonali Bendre

పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం షాహిద్ అఫ్రిది, బాలీవుడ్ నటి సోనాలి బింద్రేతో సంబంధం పట్ల సర్క్యులేట్ అయ్యిన పుకార్లను స్పష్టంగా ఖండించారు. ఇటీవల జరిగిన ఒక ఉర్దూ Read more

ఈ అమ్మడు సూపర్ ఫైట్ లీగ్ పోటీల్లో పాల్గొంది
ritika singh 1

1994లో ముంబైలో జన్మించిన రితికా సింగ్, దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కథానాయిక. ఆమె కేవలం ఒక మంచి నటిగా మాత్రమే కాకుండా, Read more

వెంకటపాలెంలో అట్టహాసంగా శ్రీనివాస కల్యాణం
srinivasa kalyanam in venka

ఏపీ రాజధాని అమరావతికి సమీపంలోని వెంకటపాలెంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తుల ఉత్సాహంతో ఆలయ ప్రాంగణం భక్తిరసంతో Read more

సీఎం చెప్పినవన్నీ డొల్లమాటలే – కేటీఆర్
ktr revanth

వందశాతం రుణమాఫీ పూర్తిచేశామని విర్రవీగిన ముఖ్య మంత్రివన్నీ డొల్లమాటలేనని సీఎం రేవంత్ ఫై కేటీఆర్ విమర్శించారు. 2 లక్షల రుణమాఫీ పూర్తయిందన్న సన్నాసి మాటలు నయవంచన కాక Read more

×