A huge scam in Jagananna colonies.. BJP MLA

జగనన్న కాలనీల్లో భారీ కుంభకోణం : బీజేపీ ఎమ్మెల్యే

అమరావతి : బీజేపీ ఎమ్మెల్యే డా.పార్థసారథి జగనన్న కాలనీల భూసేకరణలో భూకుంభకోణంపై విచారణ జరిపించాలని కలెక్టర్ కు వినతపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగనన్న కాలనీల్లో భారీ కుంభకోణం జరిగింది. రాష్ట్రంలో రూ.2,500 కోట్ల కుంభకోణం జరిగింది. ధర తక్కువగా ఉన్న భూమవులను గుర్తించి తక్కువ ధరకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ప్రభుత్వానికి ఎక్కువ ధరకు ఇచ్చారు. ఆదోని మండలం మండగిరి లో 65 మంది రైతుల నుంచి సేకరించారు. ఎకరా రూ.5లక్షలకు రైతులతో ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం రూ.13 లక్షల నుంచి రూ.23 లక్షలు నేతలు తీసుకున్నారు.

image

బ్యాంకు అకౌంట్ లు ఓపెన్ చేసి పాసుపుస్తకాలు నేతల దగ్గర పెట్టుకున్నారు. ఆదోని నియోజకవర్గంలోనే 23 కోట్లు ప్రభుత్వం ఇస్తే రైతులకు చేరింది 13 కోట్లు మాత్రమే. అప్పటి ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, వారి అనుచరులపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రమంతా అన్ని నియోజకవర్గాల్లో ఇలాగే రైతులను మోసాగించి నేతలు నొక్కేశారు. 175 నియోజకర్గాల్లో 2,500 కోట్ల కుంభకోణం జరిగింది. పేద రైతులకు దక్కాల్సిన డబ్బులు వైసీపీ నేతలు తినేశారు. వేలాది మంది రైతులను మోసం చేశారు. జగనన్న కాలనీ భూములకు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి రూపాయి రైతుకు చేరాలి. కర్నూలు జిల్లాలో జరిగిన అక్రమాలపై కలెక్టర్ విచారణ జరిపించాలి అని బీజేపీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Related Posts
Posani : ఈ నెల 21న పోసాని బెయిల్ పిటిషన్ పై తీర్పు
పోసానికి హైకోర్టులో దొరకని ఊరట

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోసాని కృష్ణమురళి కేసు హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో సీఐడీ ఆయనపై కేసు నమోదు Read more

Nara Lokesh: ప్రైవేట్ వర్సిటీలను అడ్డుకున్న వైసీపీ: లోకేష్
Nara Lokesh: ప్రైవేట్ వర్సిటీలను అడ్డుకున్న వైసీపీ: లోకేష్

వాస్తవాలను అంగీకరించని వైసీపీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై వాస్తవాలను అంగీకరించే స్థితిలో వైసీపీ లేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ మండిపడ్డారు. మండలిలో వైసీపీ Read more

తెలంగాణ మందుబాబులకు షాకింగ్ వార్త..?
liquor sales in telangana jpg

తెలంగాణ మందుబాబుల జేబులకు చిల్లు పడే వార్త. త్వరలో మద్యం ధరలు భారీగా పెంచేందుకు సర్కార్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. పక్క రాష్ట్రాల్లో ఉన్న రేట్లకు అనుగుణంగా Read more

డిసెంబరులో 6 విమాన ప్రమాదాలు 234 మరణాలు
డిసెంబరులో 6 విమాన ప్రమాదాలు, 234 మరణాలు

డిసెంబర్ నెలలో వరుసగా జరిగిన ఘోరమైన విమాన ప్రమాదాలు విమానయాన భద్రతపై గంభీర ప్రశ్నలను లేవనెత్తాయి. మొత్తం 6 ప్రధాన సంఘటనల్లో 234 మంది మరణించడం తీవ్ర Read more