అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్టు – వృద్ధ మహిళను మోసం చేసిన కేసు
ఉత్తర అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి మోసం కేసులో అరెస్టయ్యాడు. నార్త్ కరోలినాలో గిల్ఫోర్డ్ కౌంటీలో ఈ సంఘటన జరిగింది. కిషన్ కుమార్ సింగ్ అనే 21 ఏళ్ల యువకుడు చట్ట విరుద్ధంగా వృద్ధ మహిళను మోసం చేయడానికి ఫెడరల్ ఏజెంట్‌గా నటించినట్లు అధికారులు వెల్లడించారు. స్టోన్స్ఫేట్ ప్రాంతంలో నివసిస్తున్న వృద్ధురాలికి ఇటీవల అనుమానాస్పద కాల్స్ వచ్చాయి. కాల్ చేసిన వ్యక్తులు తమను ఫెడరల్ అధికారులు అని పేర్కొంటూ, ఆమె బ్యాంకు ఖాతాలో గల మొత్తం ప్రమాదంలో ఉందని భయపెట్టారు.వృద్ధురాలిని నమ్మబలికి, వెంటనే డబ్బును విత్‌డ్రా చేసి వారి వ్యక్తికి అందజేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ క్రమంలో కిషన్ కుమార్ సింగ్ అనే యువకుడు “ఫెడరల్ ఏజెంట్”గా ఆమె ఇంటికి వచ్చాడు. అయితే వృద్ధురాలు దీనిపై అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది

India : వృద్ధురాలిని మోసగించాడాని అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్ట్
గిల్ఫోర్డ్ కౌంటీ పోలీసులు తనిఖీలు జరిపి, పూర్తి సమాచారంతో అతన్ని అరెస్టు చేశారు. ప్రస్తుతం అతని వద్ద నుంచి సేకరించిన ఆధారాలతో మరిన్ని విషయాలను విచారిస్తున్నారు.అమెరికాలో విదేశీ విద్యార్థులపై వర్తించే చట్టాల ప్రకారం, వీసా నిబంధనలకు విరుద్ధంగా నేరచర్యల్లో పాల్గొనడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. India ఈ కేసు కూడా అమెరికా లో ఉన్న భారతీయ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. విద్యార్థులంతా చట్టబద్ధంగా జీవించాలని, మోసాలకు పాల్పడే ప్రవర్తన దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read More : Russia: ఉగ్రవాదాన్ని ఏరివేయడంలో భారతకు రష్యా పూర్తి మద్ధతు